ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి!

ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి!

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ 43, కెప్టెన్ విలియమ్సన్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో 28వ మ్యాచ్‌లో మెరుపులు కరువయ్యాయి. 11 ఓవర్లు ముగిసినా ఇప్పటి వరకు ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం విశేషం. ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మొదటి ఓవర్ నుంచే చెలరేగే బ్యాట్స్‌మన్ ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతుంటారు. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం అడపాదడపా ఫోర్లు తప్ప సిక్సర్ల ఊసే లేకుండా పోయింది. సగం ఓవర్లు ముగిసినా ఇప్పటి వరకు ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడంతో స్టేడియంలో ప్రేక్షకులు కూడా అందుకోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నారు.

Related Images: