ఐపీఎల్ ఫైనల్ ఫిక్స్ అయ్యిందా?

ఐపీఎల్ ఫైనల్ ఫిక్స్ అయ్యిందా?

హాట్ స్టార్ యాప్‌లో తాజాగా వచ్చిన ఓ ప్రోమో హాట్ టాపిక్‌గా మారింది. రెండో క్వాలిఫయర్ జరగకుండానే ఫైనల్లో చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయంటూ ఓ ప్రోమో హాట్‌స్టార్‌లో ప్రసారం కావడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.

అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు అనుబంధ సంస్థలో ఇలాంటి ప్రకటన రావడంతో మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్వాలిఫయర్‌1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఇంకా నాకౌట్ కాలేదు.

ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై నెగ్గిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్‌లో సన్ రైజర్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన టీం టైటిల్ పోరులో చెన్నైతో తలపడనుంది. కానీ, రెండో క్వాలిఫయర్ ఫలితం తేలకుండానే ఫైనల్‌లో కోల్‌కతా అనే ప్రకటన రావడంతో మ్యాచ్ ఫిక్సయిందంటూ అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నాలిక్కరుచుకున్న హాట్‌స్టార్… వెబ్‌సైట్ నుంచి ఆ వీడియోను తొలగించింది. కానీ, అధికారిక బ్రాడ్ కాస్టర్ తయారు చేసిన ప్రకటన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలకు తావిస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారని తెలిపింది.

Related Images: