ధోనీ కోసమైనా ట్రోఫీ గెలవాలి

ధోనీ కోసమైనా ట్రోఫీ గెలవాలి

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కోసం ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవాలని అనుకుంటున్నట్లు ఆ జట్టు ఆటగాడు సురేశ్‌ రైనా తెలిపాడు. ఈ ఏడాది క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఐపీఎల్‌లో చెన్నై ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి. కాగా ధోనీ ఫైనల్‌ ఆడటం ఇది ఎనిమిదోసారి. గత ఏడాది రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఆడిన సంగతి తెలిసిందే.

Related Images: