ఆ దర్శకుడికి… ఆతడితో సంబంధం నిజమేనా?

ఆ దర్శకుడికి… ఆతడితో సంబంధం నిజమేనా?

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, డిజైనర్ మనీష్ మల్హోత్రా తమ రిలేషన్‌షిప్ గురించి వెల్లడించడానికి పెద్దగా ఇష్టపడరు. తమ ‘సం’బంధం గురించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసినా ఇద్దరిలో ఎవరూ కూడా ఎప్పుడూ ఈ విషయంలో బహిర్గతం కాలేదు. అయితే మనీష్ మల్హోత్రా తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చర్చనీయాంశం అయింది. ఈ పోస్టుకు వచ్చిన కామెంట్లకు ఆయన రియాక్ట్ అయిన తీరుతో పరోక్షంగా ఆయన తమ రిలేషన్‌షిప్ గురించి క్లూ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

క్యూటెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్

కరణ్ జోహార్‌తో తన రిలేషన్‌షిప్ విషయంలో హింట్ ఇచ్చే విధంగా మనీష్ మల్హోత్రా సోషల్ మీడియాలో రియాక్ట్ అయినట్లు బాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇటీవల కరణ్ పుట్టినరోజు సందర్భంగా మనీష్ అతడితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్టుకు వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. అందులో కొందరు ‘మీ జంట ఎంతో క్యూట్‌గా ఉంది. క్యూటెస్ట్ కపుల్’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆ కామెంట్లను లైక్ చేసిన మనీష్

ఇలా వచ్చిన కామెంట్లను మనీష్ లైక్ చేశారు. ఇలా లైక్ చేయడం ద్వారా కరణ్ జోహార్‌తో మనీష్ మల్హోత్రా తన రిలేషన్ షిప్ కన్‌ఫర్మ్ చేశారు అనే వాదన వినిపిస్తోంది అంటూ సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది.

25 ఏళ్ల నుండి పరిచయం…

అయితే కరణ్ జోహార్ కానీ, మనీష్ మల్హోత్రాగానీ అధికారికంగా తమ రిలేషన్ గురించి ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ ఇద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల నుండి పరిచయం ఉంది. 1993లో వచ్చిన సంజయ్ దత్ -శ్రీదేవి మూవీ ‘గుమ్రా’ సమయంలో వీరు తొలిసారి కలిశారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య స్నేహాన్ని మంచి అనుబంధం ఏర్పడినట్లు టాక్.

karann

బర్త్ డే సెలబ్రేషన్స్…

గతేడాది మనీష్ మల్హోత్రా 50వ పుట్టినరోజు వేడుకను కరణ్ జోహార్ ఘనంగా నిర్వహించారు. ఈ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. మే 25న కరణ్ జోహార్ తన పుట్టినరోజు వేడుక న్యూయార్కులో జరుపుకున్నారు. ఈ వేడుకలో మనీష్, శ్వేతా బచ్చన్, కాజల్ ఆనంద్, మరికొందరు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పాల్గొన్నారు.

Related Images: