ఆ హీరోయిన్‌తో సంబంధాన్ని ఒప్పేసుకున్న స్టార్ హీరో!

ఆ హీరోయిన్‌తో సంబంధాన్ని ఒప్పేసుకున్న స్టార్ హీరో!

 బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ అలియా భట్‌తో రణబీర్ డేటింగ్ చేస్తున్నాడని, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని ఆ వార్తల సారాశం. ఈ మధ్య తరచూ ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం, పార్టీల్లో దర్శనమిస్తుండటంతో ఇద్దరి మధ్య ఏదో ‘సం’బంధం మొదలైంది అనే అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ వార్తలపై రణబీర్ కపూర్ స్పందించారు.

alia bhatt

ఆమెతో సంబంధం నిజమే అని ఒప్పుకున్న రణబీర్…

జిక్యూ మేగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్‌కు అలియా భట్‌తో డేటింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై స్పందిస్తూ… ‘ఇది నిజంగా కొత్తగా ఉంది. అయితే దాని గురించి ఇపుడే మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను.’ అని చెప్పడం ద్వారా తమ రిలేషన్ గురించి ఒప్పేసుకున్నాడు రణబీర్ కపూర్.

అలియా గురించి గొప్పగా చెప్పిన రణబీర్…

వర్క్ విషయంలో, నటన విషయంలో, చివరకు జీవితం విషయంలో…. అలియా నాకు చాలా నచ్చింది. ఆమెతో అనుబంధం చాలా కొత్తగా ఉంది. అంటూ తన కొత్త ప్రేయసి గురించి రణబీర్ కపూర్ ఎంతో గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు.

ranbeer kapoor

లైఫ్ చాలా ఎంజాయ్‌బుల్‌గా ఉందన్న రణబీర్

మనం కొత్తగా ప్రేమలో పడినపుడు జీవితం చాలా ఎంజాయ్‌బుల్‌గా ఉంటుంది. మన లైఫ్‌లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చినపుడు ఏదో తెలియని నూతనోత్సాహం వస్తుంది. ఓల్డ్ ట్రిక్స్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. మనకు మనం ఎంతో రొమాంటిక్‌గా, చార్మింగ్‌గా కనిపిస్తాము. అన్నింటికంటే, ముఖ్యంగా నా జీవితం ఇప్పుడు ఎంతో బ్యాలెన్సింగ్‌గా ఉందనిపిస్తోంది….. అని రణబీర్ తెలిపారు.

ranbeer

అలియా కూడా ఒప్పేసుకున్నట్లే

ఆ మధ్య అలియా భట్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో మీకు ఎవరిపై క్రష్ ఉందని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా ‘రణబీర్ కపూర్’ అంటూ సమాధానం చెప్పింది.

ఇంతకు ముందు రణబీర్ ఎఫైర్లు

రణబీర్ కపూర్ ఇంతకు ముందు దీపిక పదుకోన్, కత్రినా కైఫ్‌లతో లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరితో తెగదెంపులు అయ్యాక కొంతకాలం ఒంటరిగా ఉన్న రణబీర్ క్రమక్రమంగా అలియాకు దగ్గరయ్యారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కలిసి నటిస్తున్న సమయంలోనే వీరి రిలేషన్ బలపడినట్లు తెలుస్తోంది. అలియా కొందరు యంగ్ హీరోలతో డేటింగ్ చేసింది.

Related Images: