డైరెక్టర్ క్రిష్ విడాకులు తీసుకోబోతున్నాడా..?

డైరెక్టర్ క్రిష్ విడాకులు తీసుకోబోతున్నాడా..?

గమ్యం , వేదం , కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి ఉత్తమమైన చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్) విడాకులు తీసుకోబోతున్నాడా..అనే వార్త ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది.

director_krish

ఆగస్ట్ 7.. 2016 న రమ్య ను క్రిష్ పెళ్లి చేసుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ కు మధ్యలో 3 వారాల పాటు బ్రేక్ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా రెండు ఏళ్లు గడవకముందే వీరిద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విడాకులకు అసలు కారణం ఏంటనే విషయం మాత్రం ఇంకా బయటకు రానప్పటికీ , రమ్య.. డైరెక్టర్ క్రిష్ మధ్య విబేధాలు అంతగా లేవని.. వీరిద్దరి మధ్య అవగాహన కుదరలేదని.. అందుకే ఇద్దరూ సమ్మతంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక చిత్రాన్ని పూర్తి చేసాడు. త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ ను మొదలు పెట్టనున్నాడు.

Related Images: