బయటకు వచ్చిన పూజ హెగ్డే వ్యసనాల సీక్రెట్ !

బయటకు వచ్చిన పూజ హెగ్డే వ్యసనాల సీక్రెట్ !

ప్రస్తుతం పూజ హెగ్డే హవా వెలిగిపోతోంది. మహేష్ జూనియర్ లాంటి టాప్ హీరోలు అంతా పూజ హెగ్డేను తమ హీరోయిన్ గా ఎంపిక చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈమె డేట్స్ దొరకని పరిస్థితి. ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ సక్సస్ ఏమి సాధించకపోయినా టాలీవుడ్ లో ఈమెకు ప్రస్తుతం నడుస్తున్న క్రేజ్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

pooja-hegde 

ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యసనానికి సంబంధించిన ఒక సీక్రెట్ బయటపెట్టింది. చాలామందికి ఎంత ప్రయత్నించినా తాము కొన్ని అలవాట్ల నుండి బయటపడలేక వ్యసనాలుగా మారిపోతున్న పరిస్థుతలలో తనకు ఉన్న ఒక విచిత్రమైన వ్యసనాన్ని బయట పెట్టింది.

తాను సినిమా షూటింగ్ ల కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనకు షాపింగ్ చేయాలన్న కోరిక కలుగుతుందని దీనితో తనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎదో ఒక వస్తువును ప్రతిరోజు షూటింగ్ తరువాత షాపింగ్ చేసి కొనకపోతే తనకు నిద్ర పట్టదు అన్న విషయాన్ని లీక్ చేసింది. అంతేకాదు తాను షాపింగ్ చేసే వస్తువులలో ఎక్కువగా కళ్ళజోడులను తెగ కొంటానని ఇప్పటికి తన ఇంటిలో వందల సంఖ్యలో కళ్ళజోళ్ళు ఉన్న సంగతిని బయటపెట్టింది.

Pooja-Hegde

మొదట్లో తన అందాన్ని ఎలివేట్ చేయడంలో కళ్ళజోడులు బాగా ఉపయోగ పడతాయి అని షాపింగ్ చేయడం మొదలుపెట్టానని అయితే ఇప్పుడు ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది అంటూ తనపై తానే జోక్ చేసుకుంది పూజ. దీనితో చాలామంది తమ అలవాట్ల నుండి బయటకు రావాలని ప్రయత్నించినా ఎందుకు బయటపడలేక పోతున్నారో తనకు అర్ధం అయింది అంటూ పూజ తన బలహీనతను ధైర్యంగా బయటపెట్టింది..