నా చెల్లెను ఏమైనా అంటే ఖబర్ధార్!

నా చెల్లెను ఏమైనా అంటే ఖబర్ధార్!

ఈ మాట అంటుంది ఎవరో కాదు బాలీవుడ్ హీరో..అతిలోక సుందరి శ్రీదేవి సవతి కొడుకు అర్జున్ కపూర్. దుబాయిలో తన బంధువులకు సంబంధించిన వివాహ వేడుకలో పాల్గొన్న శ్రీదేవి అక్కడే ఓ హోటల్ లో అనుకోకుండా మృతి చెందారు. మొదట్లో ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వచ్చినా..చివరకు దుబాయ్ పోలీస్ వారు అతి యాక్సిడెంటల్ డెత్ అని సర్టిఫై చేశారు. మూడు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఇండియాకు చేరింది. అభిమానుల శోక సంద్రం మద్య శ్రీదేవి అంత్యక్రియలు అయ్యాయి.

 Arjun-Janhvi-Khushi-Anshula-Kapoor

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు బోని కపూర్. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ‘ధడక్’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి మరణం తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె కూతుళ్లు దుఖఃసాగరంలో మునిగిపోయారు. దాంతో బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ శ్రీదేవి కూతుళ్ల విషయంలో విపరీతమైన సానుభూతి చూపించారు.

JANVI

ప్రస్తుతం ధడక్ సినిమాషూటింగ్ జరుగుతుంది. అయితే బోని మొదటి భార్య పిల్లలైన అర్జున్, అన్షులా కపూర్‌లు కూడా జాన్వీ, ఖుషీలను సొంత చెళ్లెల్లా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీపై కామెంట్ చేసిన ఓ దిన పత్రికపై సెటైర్ వేశారు హీరో అర్జున్ కపూర్. ఈ మద్య జాన్వి జాన్వీ కపూర్ ఓ పొట్టి డ్రెస్‌ను వేసుకోగా, దాన్ని పోస్ట్ చేస్తూ ఆమె ఏదో వేసుకోవడం మరిచిపోయిందనే శీర్షికతో ప్రచురించారు. ఇది అర్జున్ కంట పడటంతో సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక పెద్ద పత్రిక విమర్శకులకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.

ఇలాంటి వార్తలను తగ్గించడం వలన విమర్శకులను తగ్గించిన వారు అవుతారు అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో అర్జున్ కపూర్ ఆ పత్రికకు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా కాస్త ఘాటు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుందని బాలీవుడ్ వర్గం అంటున్నారు. మొత్తానికి తన చెల్లిలిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ చెప్పకనే చెప్పాడు అర్జున్. 

Related Images: