పవన్ పై కలకలం రేపిన బన్నీ ట్విట్ !

పవన్ పై కలకలం రేపిన బన్నీ ట్విట్ !

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని సంవత్సరాలపాటు జరిగిన మాటల యుద్ధానికి ఈమధ్య అల్లు అర్జున్ పవన్ పై తీసుకున్న యూటర్న్ తో కొంత వరకు పవన్ వీరాభిమానుల కోపాన్ని బన్నీ తగ్గించగలిగాడు. ఈమధ్య కాలంలో మెగా కుటుంబ హీరోలు అంతా ఒకటిగా మారి పవన్ రాజకీయ ఎత్తుగడలకు మద్దతు తెలుపుతున్న నేపధ్యంలో ఆ లిస్టులో బన్నీ కూడ చేరిపోయి తనకు పవన్ కు మధ్య ఏమి దూరం లేదు అన్న సంకేతాలు ఇచ్చాడు.

ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పై తన ఇన్స్‌టాగ్రామ్‌ ఎకౌంట్ లో చేసిన సెన్సేషనల్ కామెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘జనసేన’ పార్టీకి పవన్ కళ్యాణ్‌ కు మద్దతుగా ఒక ఫోటోను పెట్టి బన్నీ ఈకామెంట్స్ చేసాడు. ‘ప్రజాసేవ చేయాలనే మీ ఆకాంక్షకు తగ్గట్టుగా జీవించండి. దీనికి తగ్గట్టుగా సద్దుకుపోయి ప్రపంచమే మీ వెంట నడుస్తుంది.’ అంటూ కామెంట్స్ చేసాడు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై మిశ్రమ స్పందన వస్తోంది. బన్నీ అభిమానులు ఈ కామెంట్స్ ను చూసి అల్లు అర్జున్ పవన్ ల మధ్య పెరిగిపోయిన సాన్నిహిత్యానికి ఈ కామెంట్స్ నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బన్నీ వ్యతిరేకులు మాత్రం ఈ విషయం పై మరో విధంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ సినిమా ఫ్లాప్ అయిన నేపధ్యంలో పవన్ అభిమానుల సానుభూతిని పొందడానికి ఇలాంటి ట్రిక్స్ వాడుతున్నాడని అంటూ బన్నీ కామెంట్స్ పై మరో అర్ధాన్ని వెతుకుతున్నారు.

అయితే రాబోతున్న ఎన్నికలలో పవన్ పిలుపు ఇస్తే చాలు తాము అంతా ప్రచారానికి రెడీ అన్న సంకేతాలు మెగా యంగ్ హీరోలు ఇస్తున్న నేపధ్యంలో తాను కూడ ఆలిస్టులో ఉన్నాను అంటూ పవన్ కు సంకేతాలు పంపే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..

Related Images: