పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ సీఎం రమేశ్..!

పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ సీఎం రమేశ్..!

హేమతబద్ధత లేకుండా విభజన చేసి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మోసం చేసిందని ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిజాయితీపాలన అందించే చంద్రబాబుకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడని, 11 కేసుల ఆర్థిక నేరగాడు జగన్‌ను బెడ్‌ రూంలో కూర్చోబెట్టుకుని మాట్లాడడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందన్నారు.

ముఖ్యమంత్రి కేంద్రం నికంకుశ వైఖరిని ఎండగడుతూ ధర్మపోరాటం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, సహకరించకపోయినా ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నవనిర్మాణదీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు బీజేపీకి తమ సత్తా చూపారన్నారు. ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా జాప్యం చేస్తూ రాజీనామాల వ్యవహారాన్ని నడిపిన వైసీపీ నిజరూపం ప్రజలకు అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వవమని 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ చెప్పిందని మోదీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రజలు ఓటు వేసింది. నీకా, కమిషన్‌కా అని ప్రశ్నించారు. మోదీ అమిత్‌షాల వికృత రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు.

పిచ్చి ఆరోపణలు చేస్తున్న పవన్‌: ఎంపీ సీఎం రమేష్‌

ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్‌ వ్యాఖ్యానించారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. ఆయన పేరులో ఉన్న కళ్యాణ్‌ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, జనసేనలోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ముందు మసి కాక తప్పదని తెలిపారు.

కేంద్రం మహామోసం: మండలి విప్‌ రామసుబ్బారెడ్డి

రాజధాని లేకుండా అప్పుతో నిలబడ్డ రాష్ట్రాన్ని ఆదుకోకపోవడమే కాక టీడీపీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కేంద్రం మహామోసాన్ని కొనసాగిస్తోందని శాసనమండలి విప్‌ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. నాలుగేళ్లు చూసి కేంద్రం మోసం గుర్తించి చంద్రబాబు బయటకొచ్చారన్నారు. విభజన హామీలు, కడప ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామన్నారు. వైవీయూ పాలకమండలి సభ్యుడు ఎస్‌.గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారన్నారు. అయినా కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి మోసంతో రాష్ట్రాన్ని విభజించాయన్నారు. ప్రస్తుతం కేంద్ర వైఖరితో విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈసారి బీజేపీ, వైసీపీలను భూస్థాపితం చేస్తారన్నారు.

సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ ఎమ్మెల్సీలు చెంగల్రాయుడు, పుత్తా నరసింహారెడ్డి, డీసీసీ బ్యాం కు చైర్మన్‌ అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు విజయమ్మ, లింగారెడ్డి, అప్కాబ్‌ చైర్మన్‌ గుజ్జలశ్రీను, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రామకోటిరెడ్డి, టీడీపీ నేతలు హరిప్రసాద్‌, కస్తూరి విశ్వనాథనాయుడు, ప్రసాద్‌బాబు, సుభాన్‌బాష, కుసుమకుమారి, వికాస్‌ హరిక్రిష్ణ పాల్గొన్నారు.

Related Images: