కాలా రివ్యూ-రేటింగ్…

కాలా రివ్యూ-రేటింగ్…

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ లేటెస్ట్ మూవీ కాలా ఎట్టకేలకు వచ్చేసింది.. పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు ఉన్నప్పటికీ ఎక్కడో అందరికీ భయం. కబాలి ఎక్కడ రిపీట్ అవుతుందేమో అని.. పా రంజిత్ టేకింగ్ ఏమాత్రం మారలేదని సినిమా టీసర్ ట్రైలర్ లో తెలిసిపోయినా కానీ సూపర్ స్టార్ మీద నమ్మకంతో థియేటర్ కి వెళ్ళే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే..

reviewsuper star rajini kanth superstar

ఏసియా లో బిగ్గెస్ట్ స్లం ఏరియా అయిన ముంబై ధారావి ఏరియా లో ప్రజలకు అండగా ఉండే కాలా అక్కడున్న ప్రజలకు ఎలాంటి ప్రాబ్లంస్ లేకుండా చూసుకుంటాడు. కానీ ఆ లాండ్ ని దక్కించుకోవాలి అని పొలిటీషియన్ నానా పటేకర్ కోరుకుంటాడు, దాంతో కాలా కి నానా కి మధ్య గొడవ మొదలు అవుతుంది.

superstar

మరి నానా పటేకర్ కాలా ని ఎదిరించి లాండ్ ని దక్కించుకున్నాడా కాలా ఎలా నానా పటేకర్ ని అడ్డుకున్నాడు అనేది మిగిలిన కథ.సినిమా కథ సేం కబాలి లానే ఉన్నప్పటికీ అది మలేషియా నేపధ్యంలో జరిగిన కథ కాగా ఇది ముంబై లో జరిగిన కథ.

కానీ ట్రీట్ మెంట్ మాత్రం సేం కబాలి లో ఉన్నట్లే ఉంటుంది సినిమా.. స్లో నరేషన్, స్లో స్క్రీన్ ప్లే తో రన్ అయ్యే కాలా లో స్పెషాలిటీ ఏంటి అంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ మాస్ అప్పీల్ అని చెప్పాలి. కబాలి లో ఒక్క సీన్ కే పరిమితం చేసిన సూపర్ స్టార్ హీరోయిజం ఇందులో మాత్రం కుమ్మేసింది.

reviewsuper star rajini kanth superstar

సినిమాలో రెయిన్ ఫైట్, ఫ్లై ఓవర్ ఫైట్ మరో ఫైట్ సినిమాకి మేజర్ హైలెట్స్ గా నిలిచాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే రెయిన్ ఫైట్ ఈ మధ్య కాలం లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ సీన్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మిగిలిన ఫైట్స్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేశాయి.

ఇక్కడే పా రంజిత్ మాస్ ని ఓ రేంజులో ఆకట్టుకున్నాడు. రజినీ నుండి కోరుకునేది కూడా ఇలాంటి హీరోయిజమే అని చెప్పాలి. ఇది తప్పితే మిగిలిన సీన్స్ అన్ని కబాలి ని పోలి ఉంటాయి. నటీనటుల్లో రజినీ వన్ మ్యాన్ షో చేసి దుమ్ము లేపాడు అని చెప్పాలి.

kala reviewsuper star rajini kanth superstar

ఇక హీరోయిన్స్ హ్యూమా ఖురేషి మరియు ఈశ్వరీ రావ్ లు ఓకే అనిపించు కోగా నానా పటేకర్ విలనిజం ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఆకట్టుకోగా సంగీతం మాత్రం కొంచం నిరాశ పరిచినా సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఓ రేంజ్ లో కుమ్మేశాడు.

రజినీ హీరోయిజం సీన్స్ లో సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పీక్స్ లో ఎలివేట్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. ఎడిటింగ్ లా తీసేసే సీన్స్ చాలా ఉన్నాయి అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే స్లో గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అని చెప్పాలి.

kala kala reviewsuper star rajini kanth superstar

పా రంజిత్ రజినీ ని కబాలి లో సరిగ్గా చూపెట్టడంలో విఫలం అవ్వగా ఇక్కడ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథ విషయంలో అక్కడ మరియు ఇక్కడ కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయాడు. కానీ రజినీ తన పవర్ తో సినిమా లెవల్ ని మార్చేశాడు.

super star rajini kanth superstar

మొత్తం మీద ఫ్యాన్స్ కి రజినీ నుండి ఎలాంటి హీరోయిజం చూడాలి అనుకున్నారో అది చూపించిన సినిమా కాలా.అంతకుమించి కథ కథనం లాంటివి పట్టించుకునే వాళ్ళకి ఇది జస్ట్ యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గద సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కరం.