ఆ రికార్డులో ‘బాహుబలి’ తర్వాత ‘భరత్ అనే నేను’

ఆ రికార్డులో ‘బాహుబలి’ తర్వాత ‘భరత్ అనే నేను’

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’అద్బుతమైన విజయం సాధించింది. ఇక మహేష్ బాబు నటించి బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దాంతో తన తర్వాత సినిమా మంచి సక్సెస్ కావాలని భావించిన మహేష్ బాబు మరోసారి కొరటాల శివతో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా ఘనమైన విజయం సాధించింది. అంతే కాదు ఇప్పటి వరకు మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది.

After Baahubali Movie Bharat Ane Nenu Creates Record in Satellite Rights

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది. సందేశంతో కూడిన ఈ సినిమా .. మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. 200 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా .. మహేశ్ బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

After Baahubali Movie Bharat Ane Nenu Creates Record in Satellite Rights

తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 22 కోట్లకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఆ స్థాయిలో శాటిలైట్ హక్కులకు అమ్ముడైన సినిమా బాహుబలి. ఆ తర్వాత స్థానంలో ‘భరత్ అనే నేను’ నిలిచింది. కథాకథనాలు .. కొరటాల – మహేశ్ కాంబినేషన్ .. మహేశ్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ .. సంగీత సాహిత్యాలు ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. 

Related Images: