పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన గిడ్డి ఈశ్వరి…

పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన గిడ్డి ఈశ్వరి…

రాజకీయ పరిపక్వతలేని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వేసవి విడిదిగా మన్యానికి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, 2014 తరువాతే విశాఖ మన్యం అభివృద్ధి చెందిన విషయాన్ని పవన్‌ ముందు తెలుసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై పవన్‌కు ప్రేమలేదని, పాడేరులో సభ ఏర్పాటు చేసిన ఆయన, పక్కనే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు పూలమాల కూడా వేయకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. మన్యంపై అవగాహన లేని ఆయన గిరిజనుల గురించి మాట్లాడటం విచారకరమన్నారు.

మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. రాజకీయ లబ్ధికోసమే టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. సినిమాలు ఫ్లాప్‌ అవుతుండడంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ, అవినీతి పార్టీ వైసీపీని ఎందుకు ప్రశ్నించలేదని డిమాండ్‌ చేశారు. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రూ.4 కోట్లుతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.