ఎన్టీఆర్ వాచ్ సీక్రెట్ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్..!

ఎన్టీఆర్ వాచ్ సీక్రెట్ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్..!

కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును తన సన్నిహితుల మధ్య ఆనందంగా జరుపుకున్న విషయం తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడ్డ తన లేటెస్ట్ మూవే ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన స్పందన చూసి జూనియర్ తెగ మురిసిపోయాడు.

ఈ సందర్భంలో జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తారక్ కు ఒక ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడని దాని ఖరీదు కోటి రూపాయలు ఉంటుందని అంటూ మీడియాలో తెగ కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆలస్యంగా ఆ వార్తల పై కళ్యాణ్ రామ్ స్పందించాడు. తాను జూనియర్ కు వాచ్ బహుమతిగా ఇచ్చిన విషయం నిజమే అయినా ఆ వాచ్ అంత ఖరీదైనది కాదు అని అంటున్నాడు.

Kalyanram Commented on Watch Secret of JrNTR Birthday Gift

అంతేకాదు చాలామంది అనుకుంటున్నట్లుగా తాను ఆ వాచ్ ని విదేశాల నుండి తెప్పించలేదనీ హైదరాబాద్ లోని ఒక లగ్జరీ వాచ్ షోరూమ్ లో చాల సేపు వెతికి తాను జునియాట్ కోసం ఆ వాచ్ ని కొన్నాను అని అంటున్నాడు. అయితే ఆవాచ్ ధర లక్షలలో ఉంటే అది ఏకంగా అభిమానులు ఊహించుకుని కోటి రూపాయల వాచ్ గా మార్చేసారు అంటూ జోక్ చేసాడు కళ్యాణ్ రామ్.

Kalyanram Commented on Watch Secret of JrNTR Birthday Gift

అంతేకాదు అన్నదమ్ముల అనుబంధానికి కోట్ల రూపాయలతో విలువ కట్టడం ఏమిటి అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు కళ్యాణ్ రామ్. అయితే గతనెల జరిగిన జూనియర్ పుట్టినరోజు వేడుకల తరువాత వచ్చిన ఈవార్తల పై కళ్యాణ్ రామ్ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించాడు అన్నది ఎవరికీ అర్ధంకాని ప్రశ్న..

Related Images: