జూనియర్ సీరియస్-కుమిలిపోతున్న కమెడియన్ !

జూనియర్ సీరియస్-కుమిలిపోతున్న కమెడియన్ !

సినిమాలలో రాజకీయాలలో ఒకొక్కసారి రూమర్స్ ఎలా పుట్టుకు వస్తాయో ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడు అలాంటి సందర్భమే జూనియర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డిల మధ్య రిపీట్ అయింది. త్రివిక్రమ్ తీస్తున్న ‘అరవింద సమేత’ లో కమెడియన్ శ్రీనివాస రెడ్డికి ఒక మంచి పాత్ర ఇచ్చినట్లు సమాచారం. త్రివిక్రమ్ గతంలో తీసిన ‘అత్తారింటికి దారేది’ ‘అ ఆ’ సినిమాల ద్వారా శ్రీనివాసరెడ్డికి చాలామంచి పేరు వచ్చింది.

rsz_srinivas-reddy

ఇప్పుడు అదే సెంటిమెంట్ తో త్రివిక్రమ్ శ్రీనివాసరెడ్డికి ‘అరవింద సమేత’ లో ఒక ముఖ్యపాత్ర ఇచ్చాడు అని అంటున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా రీసెంట్ గా జరిగిన ఈమూవీ షూటింగ్ విషయంలో జూనియర్ శ్రీనివాసరెడ్డితో ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీ షూటింగ్ లో జూనియర్ శ్రీనివాస రెడ్డితో అసలు మాట్లాడటం లేదని చాల ముభావంగా ఉండటమే కాకుండా జూనియర్ శ్రీనివాసరెడ్డితో తాను చేయవలసిన సీన్స్ ఎప్పుడు అయిపోతాయా అన్న అసహనంతో జూనియర్ ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.

Trivikram-Srinivas

దీనితో జూనియర్ శ్రీనివాసరెడ్డిల పై సీన్స్ తీస్తున్న త్రివిక్రమ్ కూడ జూనియర్ ప్రవర్తన వల్ల చాల ఇబ్బంది పడుతున్నట్లు టాక్. చాల సంవత్సరాల క్రితం జూనియర్ అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తున్న సమయంలో ఖమ్మం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ కు గాయాలు అయిన విషయం తెలిసిందే. ఆ వ్యాన్ లో జూనియర్ తో పాటు రాజీవ్ కనకాల శ్రీనివాస రెడ్డిలు కూడ ప్రయాణించారు.

NTR

అయితే ఆప్రమాదం జరిగిన దగ్గర నుండి జూనియర్ శ్రీనివాసరెడ్డిని పక్కకు పెట్టాడు అన్న వార్తలు ఉన్నాయి. ఆతరువాత శ్రీనివాస రెడ్డి జూనియర్ ను కలిసి ఎన్ని విధాల క్లారిటీ ఇద్దామని ప్రయత్నించినా జూనియర్ స్పందించ లేదు అని అంటారు. ఈసంఘటన జరిగి చాల సంవత్సరాలు అయిపోయినా ఇంకా జూనియర్ ఆ విషయాలను మర్చిపోలేక ఇలా శ్రీనివాసరెడ్డిని దూరం పెడుతున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే ఈవిషయాలు అన్నీ నిరాధారమని జూనియర్ తనతో నటించే సహనటులందరితోను చాల అభిమానంగా మాట్లాడతాడని ఎవరో గిట్టనివాళ్ళు ఈ వార్తలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు అంటూ జూనియర్ సన్నిహితులు అభిప్రాయ పడుతున్నట్లు టాక్..