త్వరలో చంద్రబాబు-మోడీ భేటీ! గట్టిగా నిలదీసే అవకాశం…

త్వరలో చంద్రబాబు-మోడీ భేటీ! గట్టిగా నిలదీసే అవకాశం…

ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని ఈ నెల 16వ తేదీన మొదటిసారి కలిసే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత ఇరువురు కలుసుకోనున్నారు. ఈ నెల 16న నీతి అయోగ్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇరువురు కలుసుకునే అవకాశముంది.

ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నీతి అయోగ్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో టీవోఆర్‌పై పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరిలు వ్యతిరేకంగా ఉన్నాయి.

ప్రధాని మోడీ నేతృత్వంలో భేటీ…

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పాలుపంచుకోవాలని చంద్రబాబు కూడా నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్‌కు కేంద్రం ఇచ్చిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(టీవోఆర్‌)పై ఏపీతో పాటు పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఏపీ విమర్శిస్తోంది.

narendra-modi

ఒక్కటిగా అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలు

బీజేపీయేతర పార్టీలు అధికారంలో రాష్ట్రాల్లోని పలువురు ఆర్థికమంత్రులు ఇటీవల కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళలో మొదటిసారి సమావేశమయ్యారు. ఆ తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భేటీ అయ్యారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పలువురు కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ భేటీలో పాల్గొననున్నారు.

naidu

మోడీని ప్రశ్నించే అవకాశం

నీతి అయోగ్ సమావేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కేంద్రం వైఖరిపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పడం జనాభా నియంత్రణ కోసం బాగా కృషిచేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని చెబుతున్నారు.

mamatha  

మమతా బెనర్జీ గైర్హాజరు

ఇదిలా ఉండగా, ఈ నెల 16వ తేదీన రంజాన్ ఉంది. అదే రోజు నీతి అయోగ్ సమావేశం పెట్టడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ సమావేశాన్ని 17న లేదా మరో తేదీకి మార్చాలన్నారు. రంజాన్ రోజు పెడితే హాజరు కానని చెప్పారు. కాగా, ఇలాంటి సమావేశాలకు, పండుగలకు సంబంధం ఏమిటనే వారు లేకపోలేదు.

Related Images: