మళ్ళి లోకేష్ తడబాటు… నీకెవరు సాటిరారయ్యా…!

మళ్ళి లోకేష్ తడబాటు… నీకెవరు సాటిరారయ్యా…!

లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రి అండ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ముద్దుల తనయుడు. అయితే లోకేష్ గారి స్పీచ్ లో తప్పుల తడకలు, ఇతని గారి తెలుగు గురించి తెలుగు ప్రజల గురించి అందరికీ తెలుసు. అందుకే కాబోలు లోకేష్ ని అందరు పప్పు అని ముద్దు పేరుతో పిలుచుకుంటారు. ఈ విషయంలో లోకేష్ కు ఎవరు సాటి రారు. ఒక స్పీచ్ లో అయితే వేరే పార్టీ ని తిట్ట బోయి తమ పార్టీనే తిడుతాడు.

తమకు ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని లోకేష్ సెలవివ్వడం, కనీసం వార్డు మెంబర్లుగా గెలవలేని వాళ్లను ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఘనంగా చెప్పుకోవడం లోకేష్ కొసమెరుపులు. తనను ఉద్దేశించి తనే సెటైర్లు వేసుకునేంత వరకూ వెళ్లిపోయాడు లోకేష్. ఈయన ట్రాక్ రికార్డులో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి దొరికి పోయి నేను పప్పునే అని నిరూపించుకున్నాడు.

nara lokesh

ఇక తాజాగా లోకేష్ సంధించిన లెటర్ అస్త్రంలో కూడా తప్పులున్నాయి. ఈ సారి కేరాఫ్ అడ్రస్‌లో తప్పులు రాశాడు లోకేష్. సెక్రటేరియట్ స్పెల్లింగ్‌ను తప్పుగా రాశారు మంత్రివర్యులు! ఒక మంత్రి, అందునా ఐటీ శాఖా మంత్రి.. సెక్రటేరియట్కు స్పెల్లింగ్ తప్పురాయడం నభూతో అని చెప్పాలి. ఇంతటి ప్రతిభావంతుడిని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రిని చేశాడు. ఇక లోకేష్ ప్రతిభ సెక్రటేరియట్ కు స్పెల్లింగ్ తప్పురాయడంలోనే కాదు.. అమరావతికి తప్పు స్పెల్లింగ్ రాయడంలో కూడా బయటపడింది. అమరావతిని ఇంగ్లిష్ లో రాసినప్పుడు ‘H’ ఉండదు. అయితే లోకేష్ దాన్ని యాడ్ చేశాడు. ఇలా లోకేష్ గురించి చెప్పాలంటే చాలా ఉందిలే..!

Related Images: