ఒకే ఫ్రేమ్‌లో చెర్రీ, సీనియర్ ఎన్టీఆర్…

ఒకే ఫ్రేమ్‌లో చెర్రీ, సీనియర్ ఎన్టీఆర్…

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రెమ్‌లో కనిపిస్తున్న ఓ పిక్ ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ పిక్‌లో చెర్రీ.. సీనియర్ ఎన్టీఆర్ ఫొటో క్రింద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్‌ని చూసి తెగ సంబర పడుతున్నారు మెగా, నందమూరి అభిమానులు. ఫొటోను తారక రామారావు మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకోవడం విశేషం.

ram charana

తోటి స్టార్ హీరో చెర్రీ.. తాత ఎన్టీఆర్ వైపుగా చూస్తూ ఏదో ఆలోచిస్తునట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్.. ”మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ” అనే కాప్షన్ పెట్టారు. దీంతో పిక్ కాసేపట్లోనే వైరల్‌గా మారింది. లైకులు, షేర్స్ చేస్తూ ఈ పిక్‌ని హోరెత్తిస్తున్నారు అభిమానులు. ఓ పక్క జక్కన్న తీర్చిదిద్దనున్న ఎన్టీఆర్, చెర్రీ మల్టీస్టారర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షక లోకం.. తారక్ షేర్ చేసిన ఈ ఫొటో చూసి మురిసిపోతున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ పనులకు మెరుగులు దిద్దే పనిలో ఉన్న రాజమౌళి త్వరలోనే ఇద్దరు యంగ్ హీరోలను సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరోపక్క రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు.

Related Images: