మహేశ్‌ బాబు కొత్త లుక్ వైరల్‌!

మహేశ్‌ బాబు కొత్త లుక్ వైరల్‌!

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విభిన్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు లో అందగాడు మహేష్ బాబు ని ఇతరు హీరోలు సైతం కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రం తర్వాత మాస్ హీరోగా తన సత్తా చాటారు.

mahesh-babu-new-look

మాస్, క్లాస్ చిత్రాలతో మహేష్ బాబు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాతా వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలాయి. మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ద బెస్ట్ చిత్రంగా నిలిచింది.

రాజకీయ కోణంలో వచ్చిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం మహేష్ బాబు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారట. ఇటీవల మహేశ్ బాబు గెడ్డంతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొత్త సినిమాలో మహేశ్‌ బాబు లుక్‌ ఇలాగే ఉంటుందని అనుకున్నారు.

Mahesh-Babu-stuns-with-his-droolworthy-look

అయితే, వాటిల్లో మహేశ్‌ ముఖం స్పష్టంగా కనపడలేదు. తెలుగు మూవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 25 ఏళ్ల వేడుక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో గడ్డం, మీసాలతో మహేశ్‌ బాబు స్పష్టంగా కనపడుతూ అలరిస్తున్నారు. 

Related Images: