బిగ్ బాస్ 2 లో కామన్ మాన్ కి షాక్!

బిగ్ బాస్ 2 లో కామన్ మాన్ కి షాక్!

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్గ్ గా ‘బిగ్ బాస్’సీజన్ 1 ఎంతో ఉత్సాహంతో కొనసాగింది. అయితే ఇందులో అందరూ దాదాపు సెలబ్రెటీలే కావడం..మద్యలో కొత్తగా మరికొంత మంది సెలబ్రెటీలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 1 బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీక్ ఎండ్ లో ఎన్టీఆర్ రావడం..ప్రేక్షకుల్లో జోష్ నింపే వారు దాంతో మిగతా రోజుల కన్నా శని, ఆదివారాల్లో ఈ ప్రోగ్రామ్ కి ఎక్కువ రేటింగ్ వచ్చేది. ప్రస్తుతం బిగ్ బాస్2 నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ సారి ఎన్టీఆర్ కి బదులుగా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదట అభిమానులు కాస్త పెదవి విరిచినా..ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండటంతో నాని హోస్ట్ గా వ్యవహరించాల్సి వస్తుంది.

big boos

ఇండస్ట్రీలో నానికి కూడా మంచి క్రేజ్ ఉండటంతో..ముందు ముందు మనోడు కూడా కనువిందు చేస్తాడని నమ్ముతున్నారు. గత బిగ్ బాస్ సీజన్‌లో అందరూ సెలబ్రిటీలే ఉండటంతో.. సామాన్య ప్రజల్ని కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్‌లో ముగ్గురు కామర్ పీపుల్‌ని తీసుకున్నారు. ఇందులో సంజనా అన్నే అనే మోడల్‌ని తీసుకోగా.. విజయవాడకు చెందిన మరో ఇద్దరు నూతన్ నాయుడు, గణేష్‌లను కామన్ మేన్ కోటాలో ఎంపిక చేశారు.

biggboss season 2

ఇదిలా ఉంటే బిగ్ బాస్2 లో మొదటి రోజే కామన్ పీపుల్ కి పెద్ద షాక్ తగిలింది. 16 మంది కంటెస్టెంట్‌లో ఎవరో ఇద్దర్ని హౌస్ నుండి బయటకు పంపేందుకు ఎన్నుకోవాలని ఆదేశించడంతో 15, 16 కంటెస్టెంట్‌లుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన సంజనా, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు..దాంతో వారిని బయట ఉన్న జైళ్లో పెట్టి తాళం వేశారు. కాగా, బిగ్ బాస్ 2 లో కామన్ పీపుల్ ని తీసుకోవడం మంచిదే..కానీ సెలబ్రెటీలు ఇలా తమను ఎన్నుకోవడం ఎంత వరకు న్యాయం అంటూ…మోడల్ సంజన ఫైర్ అయ్యారు. గేమ్ అడకుండానే..ఈ ఇద్దర్లో ఒకర్ని బయటకు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆ ఒకరు ఎవరన్నది ఆసక్తిగా మారింది. 

Related Images: