నా కోరికను నిజం చేసినందుకు థ్యాంక్స్: ఎన్టీఆర్‌

నా కోరికను నిజం చేసినందుకు థ్యాంక్స్: ఎన్టీఆర్‌

”స్టీరియో టైప్‌ రోల్స్‌, సినిమాలు చేసుకుంటూ వెళితే.. నటుడికి, అతని సినిమాలు చూసే అభిమాను లు, ప్రేక్షకులకూ సంతృప్తి అనేది ఉండదు. సినిమా హిట్టయ్యిందా? లేదా? అనే విషయాల కంటే… ‘అద్భుతంగా నటించాడు’ అనే కరతాళధ్వనులే ఏ నటుడికైనా ముఖ్యం. కల్యాణ్‌ అన్నయ్యకు ఈ సినిమాతో అటువం టి కరతాళ ధ్వనులు వస్తాయని ఆశిస్తున్నా” అన్నారు హీరో ఎన్టీఆర్‌. నందమూరి కల్యాణ్‌రామ్‌, తమన్నా జంటగా పి. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మించిన సినిమా ‘నా నువ్వే’. మహేశ్‌ ఎస్‌. కోనేరు చిత్ర సమర్పకులు.

Jr Ntr said Heartful Thanks to Kalyan Ram for Fulfilling his Desire

ఈ నెల 14న సినిమా విడుదలవుతోంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన ప్రీ-రిలీజ్‌ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన కల్యాణ్‌రామ్‌ సోదరుడు చిన్న ఎన్టీఆర్‌ కొత్త ట్రైలర్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ”నేను ‘నాన్నకు ప్రేమతో’ చేసినప్పుడు, ముఖ్యంగా ఆ గెటప్‌ వేసుకున్నప్పుడు, అప్పటివరకూ చేసిన నా సినిమాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారా?లేదా? అనే సందేహం ఉండేది. అదే టెన్షన్‌ కల్యా ణ్‌ అన్న ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, తప్పదు. నటులకు ఈ టెన్షన్లు కామన్‌.

టెన్షన్‌ వద్దు

అన్నయ్య టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ప్రేక్షక దేవుళ్ళు, అభిమానులది పెద్ద హృదయం. నిజాయితీగా కష్టపడితే, ఆ కష్టాన్ని గుర్తించి పెద్దపీట వేయడం కొత్తేమీ కాదు. ‘నా నువ్వే’కి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తారని ప్రగాఢంగా నమ్ముతు న్నా. అన్నయ్య పడిన కష్టం, టెన్షన్‌ వృథా పోదు. అన్నయ్య ను ఇలాంటి చిత్రంలో చూడాలనే నా కోరికను నిజం చేసిన దర్శకుడు జయేంద్రకి థ్యాంక్స్‌. నిర్మాతలు ఇలాంటి ప్రయత్నం చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. ఈ చిత్రం అందరి కెరీర్స్‌లో మైలురాయి కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

Jr Ntr said Heartful Thanks to Kalyan Ram for Fulfilling his Desire

మొదటి ప్రశ్న

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ”జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. కానీ, ‘హీరో పాత్రకు నేను ఎలా సూటవుతానని అనుకుంటున్నారు?’ అని అడిగాను. మొదటి ప్రశ్న ఇదే. నేను కమర్షియల్‌ సినిమాలు చేస్తున్నా. నాకు చాలామంది అటువంటి కథలే చెబుతున్నారు. ‘నా.. నువ్వే’ మాత్రం పూర్తిస్థాయి ప్రేమకథ చిత్రం. జయేంద్ర నాతో ‘రొమాంటిక్‌ హీరో రొమాంటిక్‌ సినిమా చేస్తే కొత్త ఏముంటుంది? మీరు చేస్తే, ఇప్పటివరకూ మీరు చేయని పాత్రలో ప్రేక్షకులు మిమ్మల్ని యాక్సెప్ట్‌ చేస్తే… అదే నా సక్సెస్‌’ అన్నారు. ఆయనలో కాన్ఫిడెన్స్‌ చూసి నేను ఒప్పేసుకు న్నా. పాటలకు మంచి స్పందన వస్తోన్నందుకు సంతోషంగా ఉంది.

నా కెరీర్‌లో బెస్ట్‌ ఆల్బమ్‌ ఇది. శరత్‌గారు చక్కటి సంగీతం అందించారు. ఎన్నో సంవత్సరాలుగా నేను కొత్తగా ప్రయత్నిస్తున్నా. ప్రజలు, అభిమాను లు ఆదరిస్తున్నారు. కానీ, ఇన్నేళ్ళ కెరీర్‌లో ఇలాంటి సిని మా చేయలేదు. నా ప్రయత్నాన్ని ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా మీద కాన్ఫిడెంట్‌ గా ఉన్నా. ఈ సినిమాలో నా స్టైలింగ్‌కి కారణం నేనా? తారకా? అని ఝాన్సీ అడిగారు. ‘నాన్నకు ప్రేమతో’లో తారక్‌ చాలా ఛేంజోవర్‌ చూపించా డు. నేనూ ఇటువంటి డిఫరెంట్‌ సినిమా చేయాలని కోరుకున్నాను. దేవుడు, మా తాతగారు విని నాకు ఈ సినిమా ఇచ్చారని గట్టిగా నమ్ముతున్నా. జై ఎన్టీఆర్‌” అన్నారు.

రొమాంటిక్‌ సినిమా

చిత్రదర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ ”మా నిర్మాతలు కిరణ్‌, విజయ్‌ లాస్‌ ఏంజిల్స్‌లో కథ విన్నారు. వెంటనే సినిమా చేస్తామని చెప్పారు. కల్యాణ్‌రామ్‌ కూడా కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఆయన ఎక్కువ యాక్షన్‌ సినిమాలు చేస్తారు. ఇది ఒక రొమాంటిక్‌ సినిమా. నాపై నమ్మకంతో సినిమా చేశా రు. కల్యాణ్‌రామ్‌ ఎంత రొమాంటిక్‌ బాయ్‌ అనేది ఈ నెల 14 చూస్తారు. ఆయన మేకోవర్‌, నటనలో డిఫరెన్స్‌ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారు. కొత్త కథానాయిక చేయవలసిన పాత్రను తమన్నా చేశారు. కమర్షియల్‌ ఫిల్మ్స్‌ చేసే ఆమెకూ ఇది డిఫరెంట్‌ సినిమాయే. శరత్‌ మంచి సంగీతం అం దించారు.

సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌తో నాది 35 ఏళ్ళ ప్రయాణం. ఆయన చక్కటి విజువల్స్‌ అందించారు” అన్నారు. మహేశ్‌ ఎస్‌. కోనేరు మాట్లాడుతూ ”సినిమాలో బ్రాండ్‌ న్యూ కల్యాణ్‌రామ్‌ కనిపిస్తారు” అన్నారు. చల్లని వర్షాకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా వసూళ్ళ సునామీ సృష్టించాలని పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ ఆకాంక్షించారు. చిత్రసంగీత దర్శకుడు శరత్‌, నిర్మాతలు పీడీవీ ప్రసాద్‌, విజయ్‌ చిల్లా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Images: