బిగ్ బాస్ సీజన్ 2 పై కత్తి మహేష్ సంచలన రివ్యూ..!

బిగ్ బాస్ సీజన్ 2 పై కత్తి మహేష్ సంచలన రివ్యూ..!

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నిన్న రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్టింగ్ తో చాలా గ్రాండ్ గా ప్రారంభము అయింది. ఈ సీజన్ లో 13 మంది సెలబ్రెటీలు,ముగ్గురు సామాన్యులను తీసుకున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ కోసం పూణేలో సెట్ వేశారు. ఈ రెండో సీజన్ కోసం పూణే దాక వెళ్లకుండా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. బిగ్ బాస్ ప్రారంభం అయ్యాక ఏమైనా జరగొచ్చు అంటూ నాని ఊరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసాడు. ఎన్టీఆర్ తో పోలిస్తే నాని స్టార్ డమ్ తక్కువ కావచ్చు. కానీ పాపులారిటీలో మాత్రం కాదు. నాని హోస్టింగ్ లో పెద్దగా వంకలు పెట్టాల్సిన పని లేకుండా పోయింది. బిగ్ బాస్ తోలి ఎపిసోడ్ దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. మంచి ఓపినింగ్స్ వచ్చాయా? 

Kathimahesh Shocking and Sensational Review on BigBoss Season 2

ఈ మొదటి ఎపిసోడ్ లో 16 మంది పార్టిసిపెంట్స్ ని హౌస్ లోకి పంపటం వరకు మాత్రమే జరిగింది. ఇక ఈ రోజు నుంచే అసలు అట ప్రారంభము అవుతుంది. అయితే అందరిలో ఒక సందేహం వచ్చింది. మొదటి సీజన్ వలె రెండో సీజన్ కూడా రక్తి కట్టిస్తుందా.అసలు వర్క్ అవుట్ అవుతుందా? అనేదే అందరిలోనూ ఉంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 2 కి బిగ్ బాస్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసిన కత్తి మహేష్ రివ్యూ ఇచ్చాడు. సినిమాలకు మాత్రమే రివ్యూ లు రాస్తూ సినీ జనాలకు మాత్రమే పరిచయం ఉన్న కత్తి మహేష్ ని అందరికి తెలిసేలా సెలబ్రెటీని చేసింది బిగ్ బాస్.

Kathimahesh Shocking and Sensational Review on BigBoss Season 2

బిగ్ బాస్ సీజన్ 2లో యాంకరింగ్ చేస్తున్న నానిపై కత్తి మహేష్ కత్తులు నూరాడు. బిగ్ బాస్ 2 గురించి కత్తి మహేష్ చెప్పుతూ..నాని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ చూపించే వరకు నాని బాగానే చేసాడు. తన సినిమాలోని డైలాగ్స్ గుర్తు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు.

అయితే అదంతా ఒకే టేక్ లో జరిగిందని నేను అనుకోవటం లేదు. బిట్ లుగా తీసి ఉండవచ్చు. ఒక్కో పార్టిసిపేట్ ని స్టేజ్ మీదకు పిలిచి వారిని పరిచయం చేయటం,వారితో మాట్లాడటం,వారిని హౌస్ లోకి పంపటం వంటివి చూస్తే నాని నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది.

నాని చాలా కస్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతను సినిమాలో అద్భుతమైన నటనను కనబరుస్తారు. కాబట్టి బిజీ బిగ్ బాస్ లో నాని పుంజుకోవటం ఏ మాత్రం కష్టం కాదని,బిగ్ బాస్ మంచి విజయాన్ని సాధిస్తుందని మహేష్ అంటున్నాడు.

Related Images: