పోసాని విమర్శలు…తల పట్టుకుంటున్న టీడీపీ…!

పోసాని విమర్శలు…తల పట్టుకుంటున్న టీడీపీ…!

పోసాని మురళి కృష్ణ సినిమా లలో ఎలాగైతే తన విలక్షణ నటనను ప్రదర్శిస్తాడో నిజ జీవితం లో కూడా చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఇంకా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడతాడు. అయితే ఈ మధ్య పోసాని మురళి కృష్ణ టీడీపీ మరియు ఆ పార్టీ అధినేత చంద్ర బాబు మీద ఘాటైన విమర్శలు చేసినారు. ఇది టీడీపీ కి రుచించడం లేదు.ఇంతకీ పోసాని ఏం చెప్పాడంటే…!

బాబు ఇప్పటి వరకు సమాయానుకూలంగా, తన అవసరాలకు అనుగుణంగా ఏయే పార్టీలతో ఎలా ఎలా అంటకాగారో? ఎలాపొత్తులు పెట్టుకున్నారో? అవసరం తీరాక, వాళ్లందరినీ ఎలా విసిరి కొట్టారో వివరించారు. అవన్నీ నిజం కాదా? పాయింట్ టు పాయింట్ పోసాని చెప్పింది ఒక్కటి తప్పని అనగలరా? అలాగే ఎన్టీఆర్ సంగతి. ఈ విషయంలో కాస్త బోర్డర్ దాటినట్లు పోసాని మాట్లాడి వుండొచ్చు. అయితే అక్కడా పాయింట్ వుంది.

ఆయన అన్నదేమిటి? కమ్మవారికి ఎన్టీఆర్ ఆదర్శం కావాలి కానీ చంద్రబాబు కాదు అనేగా. ఎన్టీఆర్ నిజాయతీ పరుడు అని, బాబు కాదు అన్నది పోసాని వాదన. బాబును నమ్ముకున్నవారికి అది నచ్చకపోవచ్చు. కానీ అక్కడా ఓ పాయింట్ కరెక్ట్. ఎన్టీఆర్ పై బాబు విమర్శలు చేసారు. ఆ విమర్శలు నిజం అని కమ్మవారు నమ్మితే, ఎన్టీఆర్ ను వదలండి. కాదు అంటే బాబును వదలండి అని పోసాని ఓ చిత్రమైన వాదన బయటకు తీసారు. ఇది చిత్రంగా తోచవచ్చు. కానీ ఆలోచిస్తే, మంచోడు, చెడ్డోడు ఇద్దరూ మా కులానికి ఆదర్శవంతులే అని చెప్పలేరు కదా? అది పోసాని పాయింట్.