వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు!

వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు!

సాధారణంగా రాజకీయాల్లో ఉన్నట్లే సినిమా పరిశ్రమలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. సౌత్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు గౌతం మీనన్ రిలేషన్ విషయం ఇది స్పష్టమవుతుంది. ఈ ఇద్దరు కలిసి ‘దృవ నచ్చిత్రమ్’ అనే సినిమా చేయాలనుకున్నారు…ఎవరూ ఊహించని విధంగా ఇద్దరూ విడిపోయారు, దీంతో ఇద్దరూ కలిసి చేయాలనుకనే సినిమా ప్లాన్స్ రద్దయ్యాయి. తర్వాత గౌతమ్‌ మీనన్‌ అదే చిత్రాన్ని విక్రమ్‌తో తెరకెక్కించాడు. అప్పటి నుంచి సూర్య-గౌతమ్‌ మీనన్‌ గ్యాప్‌ బాగా పెరిగిపోయింది.

ఈ దశలో ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో సంతోషాన్ని​ నింపుతోంది. ఓ వీడియో బైట్‌లో గౌతమ్‌ స్పందిస్తూ…’సూర్యతో ఓ చిత్రాన్ని ఫ్లాన్‌ చేస్తున్నానని.. ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్నానని, అన్నీ కుదరితే వచ్చే ఏడాది ఈ చిత్రం ఉంటుందని’ తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నానని, వచ్చే ఏడాది ఈ సినిమా రూపొందుతుందని గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు.

మరోవైపు, సూర్య కూడా గతంలో గౌతమ్‌ మీనన్‌కు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు. గతంలో సూర్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో కాఖా కాఖా(తెలుగులో ఘర్షణ), వారనమ్‌ ఆయిరామ్‌(సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌)లాంటి బ్లాక్‌ బస్టర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం ఎలా ఉంటుందోనన్న టాక్‌ అప్పుడే మొదలైపోయింది. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తుండగా, దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Images: