మ్యాచ్‌ ఓడిపోయినా ట్రోఫీని పంచుకున్న ఇరు జట్లు!!

మ్యాచ్‌ ఓడిపోయినా ట్రోఫీని పంచుకున్న ఇరు జట్లు!!

భారత తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆప్గనిస్తాన్‌తో రెండు రోజుల్లోనే ముగిసిన చారిత్రక టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆప్గన్‌ ఒకే రోజు రెండు సార్లు ఆలౌట్‌ అయ్యి భారీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కప్‌ అందుకున్న కెప్టెన్‌ రహానె సహచర ఆటగాళ్లతో కలిసి ఫోటోలు ఫోజిచ్చేందుకు సిద్ధమయ్యారు.ఇంతలోనే పక్కనే ఉన్న ఆప్గన్‌ క్రికెటర్లతో పాటు ఆదేశ క్రికెట్‌ బోర్డు అధికారులను రహానె సాదరంగా ఆహ్వానించాడు. తమతో పాటు కలిసి పాల్గొనవల్సిందిగా కోరి క్రీడా స్పూర్తిని చాటాడు. దీనికి సమ్మతించిన ఆప్గన్‌ ఆటగాళ్లు.ట్రోఫీతో కలిసి ఫోటోలు దిగారు. దీన్ని బిసిసిఐ తమ అధికారిక ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. అందరూ కలిసి ట్రోఫీతో పోజిద్దామంటూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఆహ్వానించడం రహానే క్రీడాస్పూర్తికి నిదర్శనం. ఇది మర టెస్టు ఆడటం కన్నా ఎక్కువ అని బిసిసిఐ ట్వీట్‌ చేసింది.

Ajinkya Rahane invited Afghanistan Players to join hosts for photograph

దీనికి స్పందించిన క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌, ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్‌సన్‌లు తమ అభినందనలు వ్యక్తం చేశారు. అయితే ఈ విజయంపై రహానె ఇలా స్పందించాడు. ఆప్గనిస్తాన్‌ జట్టు బాగా కృషి చేసింది కాబట్టే ఇంతటి వరకు రాగలిగింది. ఆజట్టు బౌలింగ్‌లో మంచి ప్రతిభను కనబరిచిందని పేర్కొన్నాడు.

కాగా, ఈ సిరీస్‌లో శిఖర్‌ ధావన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. 96 బంతులు ఆడిన ధావన్‌ 107 పరుగులు చేశాడు. క్రికెట్‌ అనేది ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన ఆట. ఒకసారి ఆప్గనిస్తాన్‌ జట్టు విజయం పొం దిందంటే వరుసగా రికార్డులు మో స్తారని ఆశా భావం వ్యక్తం చేశాడు.