రెండో కుమారుడి ఫొటో షేర్‌ చేసిన తారక్‌!

రెండో కుమారుడి ఫొటో షేర్‌ చేసిన తారక్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు ఇటీవల మరో మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. బాబు పుట్టిన సందర్భంగా తారక్‌ వైద్యులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు తారక్‌ బుల్లి ‘టైగర్’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఫొటోలో తారక్‌ కొడుకు అభయ్‌ రామ్‌ తన బుల్లి తమ్ముడిని ఎత్తుకున్నప్పుడు వారిద్దరి ఫొటో తీశారు. తారక్‌ ఫొటో తీస్తున్నప్పుడు వెనక నుంచి ప్రణతి ముగ్గురి ఫొటోను తీశారు. ‘బుల్లి కుమారుడికి వెల్‌కం. ఈ ఫొటో తీసింది అమాయక తల్లి. తను ఏం అనుకుని ఈ ఫొటో తీసిందో నాకు ఐడియా లేదు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు తారక్‌. కానీ తన రెండో కుమారుడికి సంబంధించిన పూర్తి ఫొటోను మాత్రం తారక్‌ చూపించలేదు. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే 28వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. బుల్లి టైగర్‌కు తారక్‌ ఏం పేరు పెట్టబోతున్నారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related Images: