నాని హోస్టింగ్ పై సెటైర్లు !

నాని హోస్టింగ్ పై సెటైర్లు !

ఒక అద్భుతమైన సినిమాను మరోసారి రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అద్భుతంగా జూనియర్ నిర్వహించిన ‘బిగ్ బాస్’ షోను నాని తన చేతిలోకి తీసుకుని మంచి మార్కులు సంపాదించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడం నాని దురదృష్టంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జూనియర్ స్థానంలో ‘బిగ్ బాస్ 2’ షోను నిర్వహిస్తున్న నాని అద్భుతాలు చేయకపోయినా ఏదోవిధంగా నిలదొక్కుకుని తన మార్క్ ‘బిగ్ బాస్ 2’ షో పై వేస్తాడు అని అందరూ ఆశించారు.

Public Satires on BigBoss Season 2 Host Actor Nani

నిన్నటితో ఈకార్యక్రమం మొదలై ఒక వారం పూర్తి కావడమే కాకుండా మొదటి ఎలిమినేషన్ కార్యక్రమం పూర్తి అయినా ఇంకా నాని హోస్టింగ్ వ్యవహారం జోరు అందుకోలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ సీజన్ 1 ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గొంతులో ఉండే గాంభీర్యం బేస్ సౌండింగ్ దానికితోడు చలాకీతనం హుషారుతో కూడిన సమయస్పూర్తి నాని హోస్టింగ్ లో కనిపించడం లేదు అన్న కామెంట్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

దీనికితోడు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొంటున్న సెలెబ్రెటీలకు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో వారితో ఎదో ఒక ఎత్తుగడ వేసి షోను రక్తికట్టించడానికి స్టార్ మా యాజమాన్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలకు నాని హోస్టింగ్ వల్ల సహాయం అందడం లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈషోకి సంబంధించి గడిచిన తొలి వారంలో పార్టిసిపెంట్ల మధ్య తీవ్ర విభేదాలు వచ్చి గ్రూపులుగా విడిపోయిన నేపధ్యంలో వారి తప్పులను ఎత్తి చూపుతూ చిలిపిగా ప్రశ్నించడంలో నాని ఫెయిల్ అయ్యాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దీనికితోడు ఈషోలో నాని వేసుకుంటున్న డ్రస్సింగ్ స్టైల్ కూడ అంత ఆకర్షణగా లేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్నటిరోజున ప్రసారం అయిన మొదటి ఎలిమినేషన్ రౌండ్ కార్యక్రమంలో నాని కేవలం తనకు ఇచ్చిన స్క్రిప్ట్ డైలాగులను ఫాలో అవుతూ మాట్లాడటమే కాకుండా హౌస్ మేట్స్ కు చురకలు అంటించడంలో తనదైన మార్క్ ను ప్రదర్శించదానికి ప్రయత్నించాడు. అయితే ఇలాంటి షోలు విజయవంతం చేయడంలో వెటకారంగా మాట్లాడుతూ అందులో హాస్యం పుట్టించే విషయంలో ఇంకా నాని బాగా హోమ్ వర్క్ చేయాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Related Images: