`అభిమన్యుడు`కి మహేష్ ప్రశంసలు..!

`అభిమన్యుడు`కి మహేష్ ప్రశంసలు..!

తమిళ హీరో విశాల్ నటించిన `అభిమన్యుడు` ఇటీవల తెలుగు రాష్ట్రాలలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అదే స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు.

తాజాగా ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు చూశాడు. సినిమా నచ్చడంతో వెంటనే దర్శకుణ్ని, చిత్రబృందాన్ని అభినందిస్తూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. “అభిమన్యుడు` నన్ను చాలా ఆకట్టుకుంది. డైరెక్టర్‌ మిత్రన్ విజన్‌, దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ఉంది. చాలా పరిశోధన చేసి సరికొత్తగా చిత్రాన్ని ఆవిష్కరించారు. హీరో విశాల్‌కు, చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో విశాల్ రికార్డు…

హీరో విశాల్, సమంత జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం ఫై పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కిన సినిమా ‘ఇరుంబు తెరై’. ఈ చిత్రాన్ని జి. హరి’ అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న తెలుగులో విడుదల చేశారు. తమిళం లో ఎలాగైతే హిట్ టాక్ సొంతం చేసుకుందో , తెలుగులోనూ అలాంటి హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు క్యూ కట్టారు. దీంతో విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్స్ రాబట్టి, విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం 17 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 7. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 3 కోట్ల కు జి. హరి ఈ చిత్ర రైట్స్ సొంతం చేసుకొవడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈ చిత్రం ఆయనకు భారీ లాభాలనే తెచ్చిపెట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Hero Vishal's Abhimanyudu movie Review,Rating and Story Description