బిగ్ బాస్ 2 పై కత్తి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ 2 పై కత్తి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి వారం రోజులు అయ్యాక ఇప్పుడిప్పుడే చర్చలోకి వస్తుంది. బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్స్ పై పెద్దగ ఆసక్తి చూపకపోవటంతో ఆ ప్రభావం TRP రేటింగ్స్ పై పడింది. అయితే సంజన,తేజస్వి,నూతన్ నాయుడు,బాబు గోగినేని కారణంగా షో లో ఆసక్తికరమైన సీన్స్ చోటు చేసుకుంటున్నాయి. సంజన ఎలిమినేటి కావటం ఆమె స్థానంలో నందిని రాయ్ ఎంటర్ అవ్వటంతో బిగ్ బాస్ షోకి కాస్త మసాలా యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత సినీ క్రిటిక్ కత్తి మహేష్ బిగ్ బాస్ షోపై తనదైన శైలిలో స్పందించారు. తమిళంలో పార్టిసిపెంట్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నారని కామెంట్ చేసాడు. ఇప్పటివరకు కత్తి మహేష్ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ పై ఎలాంటి కామెంట్ చేయకపోవటం వారిపై అసంతృప్తిని తెలియజేస్తుంది. ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటున్న బిగ్ బాస్ పై కత్తి కామెంట్స్ చేసాడు. 

సామాన్యులు పదే పదే నామినేట్ కావటం మంచిది కాదని దీప్తి సునైనా,నూతన్ నాయుడు,గణేష్ డేంజర్ జోన్ లో ఉన్నారని,బాబు గోగినేని,కౌశల్ సేఫ్ లో ఉన్నారని, అయితే పూర్తిగా సేఫ్ అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ గేమ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం.

నాకు తెలిసి తేజస్వి అన్ని విధాలా హౌస్ లో ఫుల్ కంట్రోల్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సంజన ఎలిమినేషన్ కి బిగ్ బాస్ 1 కి ఒక పోలిక ఉంది. మొదట నేను ఎలిమినేటి అవుతానని అందరు భావించిన, జ్యోతి ఎలిమినేటి అయ్యి వెళ్ళిపోయింది. ఈ సారి నూతన్ నాయుడు ఎలిమినేటి అవుతాడని భావిస్తే సంజన ను హౌస్ నుంచి బయటకు పంపేశారు. నాని ఇప్పడిప్పుడే మెరుగు అవుతున్నాడని. కత్తి మహేష్ బిగ్ బాస్ పై తన స్పందన తెలిపాడు.

Related Images: