నాలుగు పాత్రల్లో కనిపించబోతున్న సూర్య!

నాలుగు పాత్రల్లో కనిపించబోతున్న సూర్య!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సూర్యకి ఎంతో మంది క్రేజ్ ఉంది. గజిని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య తర్వాత వచ్చిన సింగం సీరీస్ తో మరింత ఇమేజ్ పెంచుకున్నాడు. తమిళంలో సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కేవలం యాక్షన్ తరహా చిత్రాలే కాదు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా సూర్య నటించడం చూస్తూనే ఉన్నాం. ఆ మద్య ’24’ చిత్రంలో మూడు డిఫరెంట్ పాత్రలతో అలరించిన సూర్య తాజాగా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. సూర్య తన 37వ సినిమాను కెవి.ఆనంద్ దర్శకత్వంలో చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.

Actor Suriya Decided to appear in 4 Roles for his Upcoming Movie

ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆనంద్. ప్రధానంగా సూర్య పాత్ర సినిమాలో మేజర్ హైలెట్ కానుందట. ఈ పాత్ర కోసం సూర్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారంలో లండన్ లో మొదలుకానుంది. ఇందులో సూర్యకు జోడీగా సాయేషా సైగల్ నటించనుంది.

హిందీ నటుడు బోమన్ ఇరానీతో పాటు అల్లు శిరీష్, సముతిర ఖని వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయనున్నారు. గతంలో కెవి ఆనంద్ సూర్యతో ‘బ్రదర్స్, వీడొక్కటే’ హిట్ చిత్రాలు తీసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. 

Related Images: