హీరో నాని పొలిటికల్ ఎంట్రీ..!

హీరో నాని పొలిటికల్ ఎంట్రీ..!

టాలీవుడ్ లో వరుస బెట్టి సినిమాలు చేస్తూ, బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్న హీరో నాని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాని నిజంగా పాలిటిక్స్‌లో వస్తున్నాడా అనుకుంటున్నారా? అదేం లేదు కానీ.. పొలిటికల్ జానర్‌లో సినిమాకు సై అంటున్నాడంతే. ఇండస్ట్రీలోకి క్లాప్ బాయ్‍గా కెరీర్ మొదలుపెట్టి ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ కాలంలోనే తన టాలెంటుతో తెలుగులో స్టార్ హీరో రేంజికి వెళ్లిపోయాడు.

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలు హోస్ట్ చేసిన బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలకు నాని తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదంటే… ఈ నేచురల్ స్టార్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల పరంగా రకరకాల జానర్లు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న నాని… త్వరలో పాలిటిక్స్‌ జోన్లోకి రాబోతున్నాడట.

వైవిధ్యమైన కథలతో వరుసగా హిట్లు కొట్టిన నాని.. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో కాస్త నెమ్మదించాడు. ఇప్పటికే స్పోర్ట్స్ నేపథ్యంలో ‘జెర్సీ’మూవీ చేయడానికి నాని అంగీకరించాడు. ఈ చిత్రం తర్వాత నాని ‘సభకు నమస్కారం’అనే పొలిటికల్ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు.

ఇటీవల మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే జానర్లో త్వరలో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ మూవీ కూడా రాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ మేనియా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో పొలిటికల్ థ్రిల్లర్స్ జనాలకు బాగా ఎక్కుతాయని భావిస్తున్నారు.

గతంలో డైరెక్టర్ మారుతి విక్టరీ వెంకటేష్‌కు రాధా అనే స్క్రిప్ట్ వినిపించాడు. కానీ వెంకీ ఆ మూవీ పట్ల అంతగా ఆసక్తి కనబర్చలేదు. రెండేళ్ల విరామం తర్వాత దానికి కొద్ది మార్పులు చేసిన మారుతి నానికి వినిపించాడని సమాచారం. యువ ఎమ్మెల్యేగా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో నాని ఈ మూవీలో కనిపించనున్నాడట.

Related Images: