‘పోకిరి’ రికార్డు బ్రేక్ చేసిన ‘రంగస్థలం’!

‘పోకిరి’ రికార్డు బ్రేక్ చేసిన ‘రంగస్థలం’!

తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. పోకిరిగా ఉన్న ఓ యువకుడు ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించడం..విలన్లను ఏరివేయడం మంచి కాన్సెప్ట్ తో పూరి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రంతో మహేష్ బాబు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రంలో పోకిరి క్రియేట్ చేసిన రికార్డులు తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’కొల్లగొట్టింది.

చాలా కాలం తర్వాత బాహుబలి, బాహుబలి 2 మరో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన రామ్ చరణ్ చిత్రం ‘రంగస్థలం’ మరో రికార్డును బద్దలుకొట్టింది. 

అప్పట్లో పోకిరి సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. కాగా, అప్పటి సినిమా టికెట్ ధరలకు, ఇప్పటి ధరలకు ఎంతో వ్యత్యాసం ఉన్నా రికార్డు రికార్డే అంటున్నారు అభిమానులు. 

Related Images: