బిగ్‌బాస్ హౌస్‌లోకి తారక్ రీఎంట్రీ!

బిగ్‌బాస్ హౌస్‌లోకి తారక్ రీఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్.. సెకండ్ సీజన్ పేలవంగా ఉందని డిసైడ్ చేసేశాయి వరుస రిపోర్ట్స్. పార్టిసిపెంట్స్ జాబితా వెలువడ్డ మరునిమిషమే ఈ తరహా టాక్ షురూ అయినప్పటికీ.. ఎంతోకొంత పాజిటివ్ కంటెంట్ దొరుకుతుందని వ్యూయర్స్ ఆశించారు. కానీ.. కొత్తదనం లేకపోగా.. పాత ఒరవడిని కంటిన్యూ చెయ్యడంలో కూడా పార్టిసిపెంట్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. థీమ్‌లో మార్పులు చేసే అవకాశం లేదు కనుక ఏదైనా స్పెషల్ ఎలిమెంట్‌ని ఇంట్రడ్యూస్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. మొదటి రెండువారాల రేటింగ్స్ చూసుకున్న స్టార్ మా మేనేజ్మెంట్.. ఒక కీలక నిర్ణయానికి తెగించక తప్పదని డిసైడయ్యిందట.

తన క్రేజ్, ఈజ్‌లతో ఫస్ట్ సీజన్‌ని ఉరకలెత్తించిన తారక్‌నే మళ్ళీ ఆశ్రయించాలన్నది బిగ్‌బాస్ నిర్మాతల తాజా తీర్మానంగా తెలుస్తోంది. తారక్ ఐఫోన్ అయితే నానీ చైనా ఫోన్ అని, నానీ బోరు కొట్టిస్తున్నాడని ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ సైతం బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో.. నాని మీదే పూర్తిగా ఆధారపడ్డం మానుకోవాలన్నది నిర్వాహకుల ఆలోచన. సీజన్ ముగిసేలోగా కనీసం రెండు లేదా మూడు సార్లయినా ‘బిగ్‌బాస్’ హౌస్‌లో తారక్ ప్రెజన్స్ ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ సీజన్లో హోస్ట్‌గానే కాకుండా.. హౌస్ లోపలికెళ్లి ‘ఇంటి సభ్యులతో’ కలిసి వంట కూడా చేసి సందడి పెంచేశాడు తారక్. రెండో సీజన్‌లో సైతం అటువంటి గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించేలా మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తారక్‌ని అప్రోచ్ అయ్యారని, ప్రపోజల్ పరిశీలనలో ఉందని చెబుతున్నారు.

సహజంగా.. ఏదైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడితే.. దాని ప్రమోషన్ కోసం ఆర్టిస్టుల్ని ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి పంపుతారు. ఇది షో థీమ్‌లో ఒక భాగం కూడా. కానీ.. ఇప్పట్లో రిలీజయ్యే తారక్ సినిమాలు ఏమీ లేవు. ఏదోఒక సందర్భం వెతుక్కుని మరీ ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా తారక్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ మూవీలో పూర్తిగా మునిగిపోయిన తారక్.. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కూడా స్పెషల్ వర్కవుట్స్ చేస్తున్నాడు. ఈ బిజీ షెడ్యూల్‌లో ‘బిగ్‌బాస్’ కోసం చిన్న గ్యాప్ తీసుకోవడం తారక్‌కి పెద్ద శ్రమ కాదని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

Related Images: