విజయం… ఆత్మవిశ్వాసం నింపుతుంది..!

విజయం… ఆత్మవిశ్వాసం నింపుతుంది..!

విజయం… ఆత్మవిశ్వాసం నింపుతుంది టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మ డబ్లిన్‌: ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడటం ఎంతో ఉపయోగపడుతోందని అంటున్నాడు భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టీ20లు ఆడుతోంది. తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా రోహిత్‌ మాట్లాడుతూ…’ఐర్లాండ్‌ పర్యటనను విజయంతో ఆరంభించడం ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో టీమిండియా ఐర్లాండ్‌ పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్‌ వెళ్లనుంది. ఇంగ్లాండ్‌ పర్యటన సవాలుతో కూడుకున్నది. ఇంగ్లాండ్‌తో ఆడే ముందు ఐర్లాండ్‌తో ఆడటంతో మాకు మంచి సన్నాహకంగా ఉంది. ఐర్లాండ్‌తో జరగబోయే రెండో మ్యాచ్‌లో కూడా మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. గెలుపు ఎప్పుడైనా మనలో ఆత్మవిశ్వాసం నింపుతుంది.

ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇంగ్లాండ్‌తో ఆడతాం’ అని రోహిత్‌ అన్నాడు. ‘చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున ఆడటం ఆనందంగా ఉంది. నేను, ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. మ్యాచ్‌లో విజయం సాధించాం.

ఫీల్డింగ్‌లో కొన్ని అనవసర తప్పిదాలు చేస్తున్నాం. మన స్థాయికి తగ్గట్టు ఫీల్డింగ్‌ ప్రదర్శన లేదు. అందులో కాస్త మెరుగుపడాల్సి ఉంది’ అని రోహిత్‌ తెలిపాడు. సిరీస్‌లో భాగంగా భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో టీ20 ఈ రోజు జరగనుంది.

మొదటి మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇస్తామని కెప్టెన్‌ కోహ్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related Images: