తెలంగాణ కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవాల్సిందే

తెలంగాణ కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవాల్సిందే

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించాలంటే పొత్తు అనివార్యమని , కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలిసిపోతే మాత్రమే కేసిఆర్‌ను అడ్డుకోవచ్చని రేవంత్‌ రెడ్డి వాఖ్యానించారు. నరేంద్ర మోదికి ఓ ఏజెంటులా కేసిఆర్‌ పని చేస్తున్నారని ఆరోపించిన ఆయన, బిజెపిని అడ్డుకునేందుకు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో విపక్షాలు చూపిన ఐక్యతను తెలంగాణలో చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌, తన పొగరును చూపించడంతో నాడు ఓడుపోయారని, ఇప్పుడు కేసిఆర్‌కూ అదే గతి పట్టనుందని రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలోనే చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.