రాణాతో గుణశేఖర్ రూ. 180 కోట్ల భారీ బడ్జెట్!

రాణాతో గుణశేఖర్ రూ. 180 కోట్ల భారీ బడ్జెట్!

‘రుద్రమదేవి’ లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్యకశిప’ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గుణశేఖర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని రానా తండ్రి, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీకి ఎంత బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారనే విషయం బయటకు వచ్చింది.

ఊహకు అందనిది 
రూ. 180 కోట్ల భారీ బడ్జెట్

మైథలాజికల్ సినిమా అంటే భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ తప్పనిసరి. మామూలు బడ్జెట్‌లో ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రూ. 180 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రధానమైనవి 
వైకుంఠం, ఇంద్రలోకం సెట్లు

సినిమాలో వైకుంఠం, ఇంద్రలోకం లాంటి సెట్లు ఇప్పటి వరకు ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూడని స్థాయిలో వేస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్కెచ్ డిజైన్స్ ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఆధ్వర్యంలో రూపొందుతున్నాయని సమాచారం.

సినిమాలో అదే హైలెట్ 
స్పెషల్ ఎట్రాక్షన్ నరసింహుడి అవతారం

ఈ చిత్రంలో నరసింహుడి అవతారం స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోందని, ఈ పాత్రకు సంబంధించిన రూపాన్ని వెండితెరపై చూపి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన డిజైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

హాలీవుడ్ స్థాయిలో 
విఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు

ఈ సినిమాలో టాప్ క్లాస్ విఎఫ్ఎక్స్ కోసం భారీ గా ఖర్చు పెడుతున్నారు. తెరపై సినిమా చూసే సమయంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యేలా గ్రాఫిక్స్ ఉండబోతున్నాయట. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

Related Images: