చిరంజీవి-పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తా..!

చిరంజీవి-పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తా..!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

ఆయన ఆ మాట అనడంతో నా గుండె జల్లుమంది

ఓసారి కెఎస్ రామారావు సినిమాలు వరుసగా దెబ్బతిని లాస్ అయినపుడు… నేను ఓ విషయం అడిగాను. నెక్ట్స్ ప్రాజెక్ట్ కరెక్టుగానే ఉందా? అంటే ఆయన ఒక మాట అన్నారు. ‘లాభం నష్టం ఇవన్నీ పక్క…నా ఆఖరి రూపాయి ఉండే వరకు ఈ సినిమాల్లోనే పెడతా, సినిమాల్లోనే ఉంటా, సినిమాల్లోనే చచ్చిపోతా’ అన్నారు. ఆ రోజు ఆయన మాట విన్నపుడు నా గుండె జల్లుమంది. ఆయనలో సినిమాపై ఎంత పాషన్ ఉందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ… అని అరవింద్ వ్యాఖ్యానించారు.

చిరంజీవి-పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తా

కరుణాకరన్ ‘తొలి ప్రేమ’ తీసిన తర్వాత అతడు ఎలా ఉంటాడో చూడాలని ఆయన చేస్తున్న ఓ సినిమా షూటింగుకు వెళ్లాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను నువ్వు దానికి డైరెక్టర్ అన్నాను. అపుడు ఆయన వెంటనే నాకు భయం వేస్తోంది సార్, నేను షూటింగ్ చేయాలి… మీరు ఇలాంటివి చెబితే నా బుర్ర పని చేయదు అన్నాడు. లేదు వారిద్దరితో నేను ఎప్పటికైనా సినిమా చేయాలి అది నువ్వే తీయాలి అన్నాను. అది ఇంత వరకు జరుగలేదు. కానీ అది జరుగుతుందని… చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలని ఆశిస్తున్నాను, జరుగుతుందనే నమ్మకం ఉంది… అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

‘తేజ్ ఐ లవ్ యూ’ ట్రైలర్ బావుంది

కరుణాకరన్ లవ్ స్టోరీల స్పెషలిస్ట్… లవ్ సబ్జెక్టుల మీద ఆయనకు ఎంతో గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి ఈ రోజు మా సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీశాడు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా హిట్టవుతుందనే ఫీలింగ్ కలిగింది. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వస్తాయని అరవింద్ అన్నారు.

ప్లాప్ అయినా ఇచ్చిన మాట కోసం

ఈ మధ్య తేజ్ నటించి కొన్ని సినిమాలు ఆడలేదు. ఏంటి ఇలా అని అడిగితే… ”వారికి ఇచ్చిన కమిట్మెంటు కోసం చేశాను అన్నాడు. ఆ డైరెక్టర్ గత సినిమాలు బాగోలేదు కదా అతన్ని తప్పిద్దాం అనే రకం నేను కాదు, మాటిచ్చాను కాబట్టి చేస్తాను, అదిపోద్దని నాకు తెలుసు… కానీ చేస్తాను” అని తేజ్ అన్నాడు. ఇలాంటి ఒక కమిట్మెంటు కోసం తన కెరీర్‍‌ను సైతం లెక్క చేయక పోవడం లాంటి అతడి క్యారెక్టర్ బాగా నచ్చింది అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

Related Images: