ఇంగ్లండ్‌పై భారత్ ఘణవిజయం..!

ఇంగ్లండ్‌పై భారత్ ఘణవిజయం..!

ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 18.2 ఓవర్లలో ఛేదించింది. రాహుల్(54 బంతుల్లో 101 నాటౌట్, 10ఫోర్లు, 5సిక్స్‌లతో) సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక మయ్యాడు. రెండో వికెట్‌కు రోహిత్(32)తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్..కెప్టెన్ కోహ్లీ(20 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. డేవిడ్ విల్లే(1/30), రషీద్(1/25) ఒక్కో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లీ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్(5/24) ధాటికి ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. జోస్ బట్లర్(46 బంతుల్లో 69, 8ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు రాయ్(30), డేవిడ్ విల్లే(29 నాటౌట్) రాణించడంతో ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. టీమ్‌ఇండియా పేస్ ద్వయం భువనేశ్వర్, ఉమేశ్(2/21) సమర్థంగా ఎదుర్కొంటూ ఓపెనర్లు బట్లర్, రాయ్ ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రాయ్‌ను ఉమేశ్ క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు.

కెప్టెన్ మోర్గాన్(7), బెయిర్‌స్టో(0), రూట్(0)ను కుల్దీప్ ఒకే ఓవర్లో పెవిలియన్ పంపి ఇంగ్లండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు.

Related Images: