చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్..!

చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్..!

తాజా తీర్పుతో సుప్రింకోర్టు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చింది. మా డిజిపి మా ఇష్టం అనే పద్దతిలో చంద్రబాబు కేంద్రాన్ని ధిక్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాను అనుకున్న వ్యక్తిని డిజిపిగా నియమించేందుఉ కేంద్రం అంగీకరించకపోవటంతో ఆ మధ్య కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరికీ తెలిసిందే. యూసిఎస్సీని లెక్క చేసేది లేదంటూ పోలీసు చట్టాన్నే చంద్రబాబు మార్చేశారు. కేంద్రంతో నిమ్మితం లేకుండానే డిజిపిని నియమించుకునే అధికారం తమకుందంటూ చంద్రబాబు కేంద్రానికి ఎదురుతిరిగారు. మొన్ననే ఉద్యోగ విరమణ చేసిన మాల్కొండయ్య, తాజాగా నియమితులైన ఠాకూర్ ను చంద్రబాబు ఆ పద్దతిలోనే నియంచుకున్నారు.

కేంద్రాన్ని ధిక్కరించిన చంద్రబాబు

 

చంద్రబాబు పద్దతిపైనే తాజాగా సుప్రింకోర్టు మండిపడినట్లుంది చూడబోతే. తీర్పు మొత్తం దేశానికంతటికీ వర్తిస్తుందనుకున్నా ఏపి వ్యవహారాన్ని చూసిన తర్వాతే సుప్రింకోర్టు తీర్పిచ్చినట్లు అనిపిస్తోంది. ఏపి తర్వాత తెలంగాణా కూడా అదే పద్దతిని అనుసరించింది. అంతుకుముందే కర్నాటక కూడా కేంద్రాన్ని ధిక్కరించింది. దాంతో కేంద్రం సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. చివరకు సుప్రింకోర్టు స్పందించి మా డిజిపి మా ఇష్టం అంటే కుదరదని స్పష్టం చేసింది.

యుపిఎస్సీ ద్వారానే డిజిపి నియామకం

 

బాగా సర్వీసున్నపుడు ఇన్చార్జిగా నియమించి సరిగ్గా విరమణకు నాలుగు రోజులుందనగా పూర్తిస్దాయి డిజిపిగా నియమిస్తామంటే కుదరదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. జెవి రాముడు విషయంలో చంద్రబాబు అదే విధంగా చేశారు. తర్వాత సాంబశివరావు విషయంలో కూడా అదే పద్దతిని అనుసరించారు. బహుశా సుప్రిం ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకున్నట్లుంది. రెండేళ్ళకు పైగా సర్వీసున్న అధికారుల జాబితాను యూపిఎస్సీకి పంపాల్సిందేనంటూ చెప్పింది. అందులో నుండి మెరిట్, సీనియారిటి ఆధారంగా యూసిఎస్సీ ముగ్గురు అధికారుల జాబితాను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుందని కోర్టు చెప్పింది. అందులో నుండి ఎవరిని ఎంపిక చేసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంగా సుప్రిం చెప్పింది. అంటే ఎన్నికల సమయంలో తనిష్టం వచ్చిన వారిని డిజిపిగా నియమించుకుని పోలీసు వ్యవస్ధను చెప్పుచేతుల్లో పెట్టుకోవాలన్న ఆలోచనకు న్యాయస్ధానం ఫుల్ స్టాప్ పెట్టినట్లే.

Related Images: