అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉంచాను..!

అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉంచాను..!

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూవుంటారు. పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో రేణు దేశాయ్ జనసేన అధినేత మీద దారుణమైన ఆరోపణలు చేసినట్లు ఉంది. ఈ ఫేక్ న్యూస్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలని, లేనిచో మా దేవుడికి చెడ్డ పేరు వస్తుందంటూ….. కొందరు పవన్ అభిమానులు రేణుపై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే .. మరాఠి చిత్రపరిశ్రమలో దర్శక నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. పవన్ నుంచి విడిపోయిన ఇంతకాలానికి మరో వ్యక్తితో ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగింది. ‘ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఎందుకు రహస్యంగా జరుపుకోవలసి వచ్చింది?’ అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది.

దీనిపై స్పందించిన రేణు దేశాయ్ “క్రితం ఏడాదే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచనను వ్యక్తం చేశాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనే విషయాన్ని మాత్రమే నేను చెబితే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ‘నిన్ను చంపేస్తాము .. నీ కాబోయే భర్తను చంపేస్తాము’ అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు. చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు .. పెళ్లి తరువాత ఆయన ఎవరనేది చెబుతాను” అంటూ స్పష్టం చేశారు. 

Related Images: