చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

చీపురుతో కొడుతున్న వీడియోతో నాగబాబు సంచలనం!

హిందువులు దేవుడుగా ఆరాధించే శ్రీరాముడి మీద కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినీ నటుడు, నిర్మాత నాగబాబు తీవ్రంగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. హిందూ మతంపై, హిందూ సంస్కృతిపై దాడి జరుగుతోంది  అంటూ ఆయన తనదైన వాదన వినిపించారు. ఈ సందర్భంగా నాస్తిక వాదం, హేతువాదంపై విమర్శలు చేశారు. నేను హిందూ సెక్యూలర్‌ను అని చెప్పుకున్న మెగాబ్రదర్ అన్ని మతాలను గౌరవిస్తూనే తన హిందూ మతంపై జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా సోషల్ మీడియాలో వరుస వీడియోలు పోస్టు చేశారు.

బ్రిటిష్ బుజ్జిగాడు 
విదేశీయులు ఆసక్తి చూపుతుంటే మీరేంటి ఇలా? .

మన భారత దేశంలో నాస్తిక వాదం, హేతువాదం ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ వారి వాదాన్ని వ్యాప్తి చేసుకుంటున్నారు. అలా చేసుకుంటూ హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే ఉన్నారు… అని నాగబాబు ఫైర్ అయ్యారు.

 

విదేశీ కుర్రాడు 
ఈ కుర్రాడిని చూసి నేర్చుకోండి

మన దేశంలోని వారు కొందరు మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే …. చాలా మంది విదేశీయులు మన సంస్కృతి మీద ఆసక్తి, గౌరవం చూపుతున్నారు. అందుకు ఈ కుర్రాడే సాక్ష్యం…. అంటూ నాగబాబు ఓ వీడియోను పోస్టు చేశారు.

Srirama Respected by British!!

Srirama Respected by British.

Posted by Naga Babu on Saturday, July 7, 2018

ఇక్కడ చాలా మందికి అవసరం 
చీపురుతో కొడుతున్న వీడియో పోస్టు చేసిన నాగబాబు

ఈ సందర్భంగా నాగబాబు తన ఫేస్‌బుక్ పేజీలో ఓ స్వామీజీ కొందరిని చీపురుతో కొడుతున్న వీడియోను పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది. స్వామి తమరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తారు ఇక్కడ చాలామందికి ఇలాంటి ఆశీర్వాదం కావాలి అని నాగబాబు పేర్కొనడం గమనార్హం.

స్వామి తమరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తారు ఇక్కడ చాలామందికి తమరి ఆశీర్వాదం కావాలి!🙏🙏

Posted by Naga Babu on Saturday, July 7, 2018

హిందూ మహాసభకు 
లండన్లో ఉండటం వల్ల రాలేక పోయాను

హిందూ దర్మాగ్రహ యాత్రకి అందరు హాజరు కావాలని, హిందూల ఐకమత్యం చూపాలని నాగబాబు కోరారు. అయితే తాను షూటింగ్ నిమిత్తం లండన్లో ఉండటం వల్ల వెళ్లలేక పోయాను అని ఆయన మరో వీడియోలో వెల్లడించారు.

రేపు జరిగే హిందూ దర్మాగ్రహ యాత్రకి అందరు రావాలి!మన హిందూల ఐకమత్యం చూపించాలి.

Posted by Naga Babu on Sunday, July 8, 2018

Related Images: