నిర్భయ దోషులకు మరణశిక్ష..!

నిర్భయ దోషులకు మరణశిక్ష..!

ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ప్రకటించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధిస్తు సంచలన తీర్పు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గత ఏడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసింది. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్ (29), పవన్ (22), వినయ్ (23)ల తరఫున పిటిషన్ దాఖలైంది. కానీ సుప్రీం కోర్ట్ మాత్రం వారి ఫిటిషన్ ను తోసిపుచ్చింది. వీరికి మరణశిక్షే కరెక్ట్ అని తేల్చిసింది.

16 డిసెంబర్ 2012 న ఢిల్లీలో వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా ఇనుప కడ్డీలతో కొట్టి రేప్ చేశారు. దీంతో తల, పేగులకు తగిలిన గాయాలతో పదమూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి 29 డిసెంబర్ 2012లో నిర్భయ తుది శ్వాస విడిచింది. ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త అనే వ్యక్తులు ఈ కేసులో నింధితులుగా ఉన్నారు. అయితే 2013 జనవరి 23న ఓ వ్యక్తిని మైనర్‌గా జువైనల్ బోర్డు తేల్చింది.

Related Images: