నాగ్ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ…!

నాగ్ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ…!

కింగ్ నాగార్జున బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్‌ తదితర హిందీ చిత్రాల్లో నటించిన నాగ్ , 2003లోఎల్‌వోసీ కార్గిల్‌ చిత్రంలో చివరిసారిగా బాలీవుడ్ మూవీ లో నటించారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ్‌ తిరిగి హిందీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు నటిస్తున్నారు. మంచి కథ వస్తే బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నాగ్ ఈ కథ బాగా నచ్చడం , బిగ్ బి సైతం ఆ మూవీ లో నటిస్తుండడం తో ఈ ఆఫర్ రాగానే కాదనలేక పోయాడట. ముంబైలో జరగబోయే షెడ్యూల్‌కు నాగ్‌ హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున తెలుగులో నానితో కలిసి దేవదాస్‌ అనే మల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.