మానసికస్థితి పై బిగ్ బాస్ వినూత్న ప్రయోగం !

మానసికస్థితి పై బిగ్ బాస్ వినూత్న ప్రయోగం !

తెలుగు ‘బిగ్‌ బాస్’ రియాలిటీ షో కోసం ‘స్టార్ మా’ యాజమాన్యం నిన్నటి షోలో ప్రసారం అయిన హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కు సంబంధించిన కార్యక్రమం ఈషోలోని సెలెబ్రెటీల మానసిక స్థితిని పరీక్ష పెట్టే కార్యక్రమంగా మారి ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబడింది. నిన్నటి కార్యక్రమంలో బిగ్ బాస్ ఒక టెలిఫోన్ బూత్ ను ఏర్పాటుచేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఉన్న స్నేహం ఎంత వరకు నిజం అన్న విషయంలో పరీక్షలు పెట్టి వారిలోని అసలు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకు రావడానికి బిగ్ బాస్ ప్రయత్నాలు చేసాడు.

ఇందులో బాగంగా తేజస్విని ఎలిమినేట్ కాకుండా సామ్రాట్ తన మీసాలు గడ్డం తీయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకున్న తరువాత మాత్రమే తేజస్వికి నామినేషన్ ప్రక్రియ నుండి ఉపసమనం కల్పించారు. ఆతరువాత గణేష్‌ ను బిగ్‌బాస్ నామినేషన్ నుండి తప్పించడానికి బాబుగోగినేని కొత్తిమీర తింటే బాబు గోగినేనిని నామినేషన్ ప్రక్రియ నుండి రక్షించడానికి గీత మాధురి తన చేతి పై టాటు వేయించుకుని బాబు గోగినేనిని రక్షించింది. అయితే దీప్తీ కోసం ఈ సీజన్ అంతా తనని తాను నామినేట్ చేసుకోవాలి అని కౌశల్ కు పెట్టిన కండిషన్ అతడు తిరస్కరించడంతో దీప్తి ఈవారం నామినేట్ అయింది.

అదేవిధంగా గీతామాదురిని రక్షించడానికి తేజస్విని తనకు ఇష్టమైన దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తే తనీష్ నామినేషన్ ప్రక్రియ నుండి రక్షించడం కోసం దీప్తి సునైన తన జుట్టు కత్తిరించుకుంది. ఇక రోల్ రైడా కోసం గణేష్ తనకు తాను స్వయంగా నామినేట్ చేసుకోవడం వీరిద్దరి మధ్య స్నేహాన్ని సూచించింది. బిగ్ బాస్ షోలో వీక్ కంటెస్టెంట్ అయిన గణేష్ ఈ సాహసం చేయడం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అదేవిధంగా అమిత్ ను నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించడానికి రోల్ రైడా తన జుట్టును కట్ చేయడానికి ఒప్పుకోవడంతో అమిత్ నామినేషన్ గండం నుండి బయటపడ్డాడు.

అయితే భానుశ్రీ కోసం అమిత్ తన తన తలకు కట్టుకొనే స్కార్ఫ్ ను తొలగించుకోవడానికి ఒప్పుకోకపోవడంతో భానుశ్రీ ఈవారం ఎలిమినేషన్ కు నామినేట్ అయింది. ఇలా రకరకాల టాస్క్ లు ఇస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఉన్న స్నేహానికి చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా ఈషోలో ఇప్పటి వరకు క్లోజ్ గా ఉన్న హౌస్ మేట్స్ మధ్య వివాదాలు పెట్టడంలో బిగ్ బాస్ సక్సస్ కావడంతో రానున్న రోజులలో ‘బిగ్ బాస్’ షో ఆసక్తికరంగా మారబోతోంది అన్న సంకేతాలు ఇచ్చింది స్టార్ మా యాజమాన్యం..

Related Images: