బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నసుకుమార్..!

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నసుకుమార్..!

టాలీవుడ్ లో సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు..చరణ్ కెరీర్ లో రెండువందల కోట్ల క్లబ్ లో చేరేలా చేసింది ఈ సినిమా. సంవత్సరం పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని థియేటర్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1985 నాటి గ్రామీణ వాతావరణం..అక్కడి ప్రేమ, రాజకీయాలు, కుట్రలు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు సుకుమార్. ఇక చెవిటి వాడి పాత్రలో చిట్టిబాబుగా రాంచరణ్ విశ్వరూపం చూపించాడు.

చెర్రీకి సరిజోడుగా సమంత కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా మొదటి నుంచి అనుకున్న అంచనాలకన్నా ఎక్కువే విజయం సాధించింది. ఈ మద్య వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ మహేష్ తో సినిమాకు కమిట్ అయినా విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ , వంశీ పైడిపల్లి దర్శకతంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ అమెరికాలో జరపనున్నారు అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు చాలా టైం పట్టేలా ఉండడంతో ఈ మధ్యలో మరో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ లెక్కల మాస్టారు. ఇటీవలే జుద్వా 2 సినిమాలో నటించి ఆకట్టుకున్న వరుణ్ ధావన్ తో ఉంటుందట. ఓ క్యూట్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇప్పటికే సుకుమార్ ముంబై వెళ్లి ఈ సినిమాకు సంబందించిన చర్చల్లో పాల్గొన్నాడని తెలిసింది. వరుణ్ ధావన్ లాంటి యంగ్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే నిజంగా అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.

Related Images: