‘2.O’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

‘2.O’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.ఓ’ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 29న విడుదల కాబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. తలైవా నటించిన ‘కాలా’ సినిమా ఇదే ఏడాదిలో విడుదలైంది. 23 ఏళ్లలో రజనీ నటించిన రెండు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలకు నోచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. రజనీ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన ‘బాషా’, ‘ముత్తు’ సినిమాలు 1995లో విడుదలయ్యాయి. ‘2.ఓ’ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తై చాలా రోజులు అవుతోంది. అసలైతే ఈ సినిమా గతేడాది దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్‌ఎక్ ఎఫెక్ట్స్‌ కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

దాంతో అభిమానులు కొన్ని నెలల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన కొన్ని సెకన్ల మేకింగ్‌ వీడియో టీజర్‌తోనే సరిపెట్టుకున్నారు. ట్రైలర్‌ ఎప్పుడు విడుదల చేయబోతున్నారన్న విషయం గురించి ఇంకా ప్రకటించలేదు. ఇందులో అమీ జాక్సన్‌ కథానాయికగా నటించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. డైరెక్టర్ శంకర్

Related Images: