జగన్ కి పోటీగా నా కూతురిని దింపుతా..!

జగన్ కి పోటీగా నా కూతురిని దింపుతా..!

ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో పులివెందులలో తన కూతురు వైయస్ జగన్ కి పోటీగా నిలబడుతుందని పేర్కొన్నారు. తాజాగా ఇటీవల ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై పోటీకి దిగుతానని పేర్కొన్నారు. 25ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడిన కన్నా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అయ్యారని ఆయన ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యారని మండిపడ్డారు. 

తనను తాను రక్షించుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇసుక విషయంలో నోటికి వచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిజంగా ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ కి ఆ ఉద్దేశం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం పై పోరాడాలని సూచించారు. 

పాదయాత్రకు జనం వస్తే ఎన్నికల్లో గెలవడం కాదని అన్నారు…గతంలో ఓ స్టార్ హీరో పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది జనం వచ్చారు కాని చివరాకరికి ఏమైందో అందరికీ తెలిసిందే అని గతం గుర్తు చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఈసారి వచ్చిన సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. పవన్ జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికలలో చంద్రబాబు గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు జలీల్ ఖాన్.

                           

Related Images: