తెలంగాణలో టీడీపీ బహిరంగ సభ : చంద్రబాబు రాక

తెలంగాణలో టీడీపీ బహిరంగ సభ : చంద్రబాబు రాక

టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్బన్‌ అధ్యక్షుడు ఈగ మల్లేశం విమర్శించారు. అండర్‌బ్రిడ్జి వద్ద పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు కక్కె సారయ్య అధ్యక్షతన టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4,000లు ఎన్నికల స్టంట్‌ మాత్రమేనన్నారు. తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. వరంగల్‌ నగరంలోని రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా మారాయన్నారు. నగరంలో చిన్న పాటి వర్షానికే రోడ్లు, డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. తూర్పునియోజక వర్గం నుంచి వివిధ పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తలు 50 మంది టీడీపీ పార్టీలో చేరారన్నారు. త్వరలో వరంగల్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నామన్నారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని టీడీపీ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు కక్కె సారయ్య ప్రారంభించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రనాయకుడు అర్షనపల్లి విద్యాసాగర్‌రావు, ఎస్సీసెల్‌ నాయకుడు బాస్కుల ఈశ్వర్‌, సిలువేరు కుమారస్వామి, జిలుకర వీరస్వామి, ఎలుగు వెంకటేశ్వర్లు, పుల్లూరి అశోక్‌కుమార్‌, గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యదర్శి ఎమ్డీ రహీం, జీఎల్‌ శ్రీధర్‌, అప్పని వెంకటేశ్వర్లు, మన్సూర్‌ హుస్సేన్‌, ఇనుమలు అజయ్‌కుమార్‌, తుమ్మల యాకయ్య, తౌటం సంపత్‌, రామరమాదేవి, బరిగేల సుధాకర్‌, పోతన వెంకటేశ్వర్లు, నర్ర కుమార్‌, బి.సంపత్‌యాదవ్‌, బజ్జూరి వీరేశం, జన్ను స్కైలాబ్‌, ఠాగూర్‌గణేష్‌ సింగ్‌, గూడూరు దయాకర్‌, మాదాసి బాబు, పోలెపాక దయాకర్‌, కండ్రాతి చిన్న రవి, కండ్రాతి రాజు, కండ్రాతి వెంకట్‌, శ్రీరాములు సరోజన, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరికలు..

ఈ సందర్భంగా గజ్జెల రవిశంకర్‌, ఎస్డీ మున్నా, తాళ్లపెల్లి రాజయ్య, పెరుగు రాజేందర్‌, సత్యారపు ప్రసాద్‌, కేశబోయిన సురేష్‌, పి.రామక్రిష్ణ, కె.మోహన్‌ టీడీపీలో చేరారు.

Related Images: