ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!

సౌత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకరని చెప్పొచ్చు. కేవలం తెలుగు సినిమాలే నటిస్తూ ఈ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తారక్ వేరే భాషల్లో చేస్తే ఆ లెక్క ఎలా ఉంటుంది. త్వరలో అదే జరుగబోతుందని అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది.

ఈమధ్యనే వరుణ్ ధావన్ తో పాటుగా దర్శకుడు శశాంక్ కైతాన్ ఎన్.టి.ఆర్ కు వచ్చీ స్టోరీ లైన్ వినిపించాడట. తారక్ కు కథ నచ్చడంతో దాదాపు ఓకే చేశాడని అంటున్నారు. వరుణ్ ధావన్ తో కలిసి ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. సినిమాకు టైటిల్ గా రణ్ భూమి అని పెట్టనున్నారట.

ఎలాగు రాజమౌళి సినిమాతో హిందిలో కూడా తన ఫాలోయింగ్ పెంచుకోనున్న ఎన్.టి.ఆర్ ఆ తర్వాత ఈ రణ్ భూమితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అరవింద సమేత సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టార్ర్ లో చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.

బాలీవుడ్ లో ఎన్.టి.ఆర్ ఎంట్రీ అంటే ఇక అక్కడ కూడా తన నట విశ్వరూపంతో ఆడియెన్స్ ను అలరించేస్తాడని చెప్పొచ్చు. మరి ఈ రణ్ భూమికి సంబందించి మిగతా విషయాలు త్వరలో ప్రకటించనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో బీ టౌన్ ఎంట్రీ ఇవ్వబోతున్న తారక్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.