చిన్న సినిమాలలో సంచలన రికార్డ్..!

చిన్న సినిమాలలో సంచలన రికార్డ్..!

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో రాంకీ, రావు రమేష్ ప్రధాన పాత్రలు చేశారు. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినినా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ను అలరిస్తుంది. సినిమా టాక్ యావరేజ్ గా ఉన్నా యూత్ ఆడియెన్స్ ఈ సినిమాకు కలక్షన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

మొదటి రోజు కోటిన్నరకు అటు ఇటుగా వసూళు చేసిన ఆరెక్స్ 100 వసూళ్ల రైడింగ్ లో రయ్యి రయ్యిమంటూ దూసుకెళ్తుంది. రెండో రోజు 3 కోట్లు, నాలుగవ రోజు 4 కోట్లు పైగా వసూళు చేయగా నలుగు రోజుల్లో 5.15 కోట్లతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వైపుగా దూసుకెళ్తుంది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఆరెక్స్ 100 5.19 కోట్ల షేర్ రాబట్టింది. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం గొప్ప విషయమని చెప్పాలి. యువత మెచ్చే అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా వసూళ్ల లెక్క ఎలా ఉందో చూస్తే..

నైజాం : 2.42 కోట్లు

సీడెడ్ : 0.59 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు

గుంటూర్ : 0.36 కోట్లు

ఈస్ట్ : 0.42 కోట్లు

వెస్ట్ : 0.32 కోట్లు

కృష్ణా : 0.35 కోట్లు

నెల్లూరు : 0.12 కోట్లు

ఏపి/తెలంగాణా : 5.19 కోట్లు

Related Images: